మొన్న సంప్రదాయబద్దంగా కనిపించి.. ఇప్పుడిలా చూపించేస్తుందేంటి!
అక్కినేని హీరో సుశాంత్ - రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన 'చిలసౌ' సినిమా ద్వారా తెలుగు సినీరంగ ప్రవేశం చేసింది రుహానీ శర్మ. ఈ సినిమా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది ఈ మరాఠీ భామ. ఈ సినిమా తర్వాత ఆమెకు ఎన్నో అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ, పరిస్థితి తారుమారైంది. 'చిలసౌ' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, కమర్షియల్‌గా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఈ సినిమా అంతగా పాపులర్ కాలేదు. అప్పటి నుంచి అమ్మడు ఖాళీగానే ఉంటోంది.
చేతిలో సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియా ఖాతాల ద్వారా తన అభిమానులతో ఎప్పుడూ అందుబాటులోనే ఉంటోంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తరచూ అందులో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన ఫొటోలను, వీడియోలను సైతం షేర్ చేస్తుంది. ఇందులో భాగంగానే కొద్దిరోజుల క్రితం ఆమె ప్రత్యేకంగా ఫోటో సెషన్‌కు హాట్ హాట్‌గా పోజులు ఇచ్చింది. ఈ ఫొటోలు చూసిన వారంతా షాక్‌కు గురయ్యారు. వాటిలో ఉన్నది రుహానీ అంటే నమ్మలేకపోయారు.

అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మ మరికొన్ని హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్న ఫొటోలో క్లీవేజ్ షోతో యువతను, ఫిల్మ్ మేకర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈ ఫొటోలకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇవి చూసిన వారంతా గ్లామర్ డోస్ ఎక్కువైనా పర్వాలేదు.. అలాంటి సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ చెప్పే విధంగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. మరి, ఇవి చూసిన తర్వాతనైనా మన దర్శక నిర్మాతలు రుహానికి గ్లామర్ రోల్స్ ఇస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











