డ్రాగన్ బ్యూటీ బోల్డ్ అవతారం.. ఈ వీడియో రియలా? డీప్‌ఫేకా?
ఇది ఏఐ యుగం.. ఏది నిజయో? ఏది అబద్దమో ? చెప్పడం కష్టం. అలా తాజాగా ఓ స్టార్ హీరోయిన్‌కు సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెట్టింట కలకలం రేపుతోంది. ఆ వీడియోలో ఆమె బోల్డ్ అవతారంలో కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అయితే అసలు ఇది నిజమైన వీడియోనా? లేక టెక్నాలజీతో సృష్టించిన డీప్‌ఫేక్ మాయనా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆ వీడియోలో కనిపిస్తున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? ఈ వైరల్ క్లిప్ వెనుక అసలు నిజం ఏమిటి? అనే ఆసక్తి ఇప్పుడు అందరిలో పెరుగుతోంది.
ఆ హీరోయిన్ ఎవరో కాదు..కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్. 'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ, తన నేచురల్ నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 'కాంతార' సీక్వెల్ సక్సెస్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగి, వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో చేరుతున్నాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్', రాకింగ్ స్టార్ యశ్‌తో 'టాక్సిక్' వంటి భారీ చిత్రాలలో నటిస్తూ తన కెరీర్ పీక్‌లో కొనసాగుతోంది.

అయితే ఇంతవరకు ట్రెడిషనల్, హోమ్లీ ఇమేజ్‌తోనే కనిపించిన రుక్మిణి ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బికినీ వీడియోలతో హాట్ టాపిక్‌గా మారింది. గత రెండు రోజులు ఆమెకు సంబంధించిన రెండు విభిన్న వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఒక వీడియోలో సూట్‌కేస్ మూసేందుకు కష్టపడుతున్న సాధారణ క్షణంలో కనిపిస్తే, మరో వీడియోలో మాత్రం గ్రీన్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో చూపించడం అభిమానులను పూర్తిగా షాక్‌కు గురిచేసింది.
వైరల్ అవుతున్న ఈ బికినీ విజువల్స్‌లో ప్రొఫెషనల్ కెమెరాలు, లైటింగ్ సెటప్, టెక్నికల్ టీమ్ స్పష్టంగా కనిపించడం. దీనితో ఇది ఏదైనా బ్రాండ్ ప్రమోషన్, ఫ్యాషన్ మ్యాగజైన్ షూట్ లేదా సినిమా కోసం చేసిన ప్రత్యేక ఫోటోషూట్ అయి ఉండొచ్చని కొందరు. ఇటీవల పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్న హీరోయిన్లు తమ ఇమేజ్‌ని విస్తరించుకునేలా గ్లామర్ డోస్ పెంచడం సాధారణమని విశ్లేషకులు కూడా చెబుతున్నారు.
కానీ మరోవైపు ఇది నిజమైన వీడియోనేనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో వేగంగా విస్తరిస్తున్న 'ఏఐ డీప్‌ఫేక్' టెక్నాలజీ కారణంగా సెలబ్రిటీల ముఖాలను వేరే వీడియోలతో మిక్స్ చేయడం సులభమైపోయింది. గతంలో పలువురు స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి ఫేక్ వీడియోలు బారిన పడినట్లుగా ఉండటంతో, రుక్మిణి వీడియో కూడా అదే తరహాలో రూపొందించబడిందేమోనని నెటిజన్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా ఆమె ఇప్పటివరకు ఎక్కడా గ్లామర్ షో చేయకపోవడం, ఎప్పుడూ సింపుల్ పాత్రల్లో నటించింది. దీంతో ఈ డౌట్‌కు మరింత బలం చేకూరుస్తోంది.
అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటివరకు రుక్మిణి వసంత్ గానీ, ఆమె పీఆర్ టీమ్ గానీ ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ వీడియోలపై సస్పెన్స్ మరింత పెరిగింది. ఒకవేళ ఇది నిజమైన షూట్ అయితే, ఆమె కెరీర్‌లో ఇది పెద్ద ఇమేజ్ మేకోవర్‌గా మారే అవకాశం ఉంది. లేకపోతే, ఇది మరో డీప్‌ఫేక్ ఉదాహరణగా మిగిలిపోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications




