బికినీ ఫొటోలపై స్పందించిన రుక్మిణి వసంత్.. ఇంతకీ ఏమన్నారంటే?
కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 'సప్త సాగరాలు దాటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ, తన నేచురల్ నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కాంతార సీక్వెల్ సక్సెస్‌తో ఆమె క్రేజ్ మరింత పెరిగి, వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఆమె ఖాతాలో చేరుతున్నాయి. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'డ్రాగన్', రాకింగ్ స్టార్ యశ్‌తో 'టాక్సిక్' వంటి భారీ చిత్రాలలో నటిస్తూ తన కెరీర్ పీక్‌లో కొనసాగుతోంది. తాజాగా ఆమె పేరుతో బికినీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. దీంతో రుక్మిణి వసంత్ స్వయంగా స్పందించారు. ఇంతకీ ఏమన్నారంటే?
గత రెండురోజుల క్రితం రుక్మిణి వసంత్ పేరిట బికినీ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యేక్షం అయింది. దీంతో చాలా మంది అభిమానులు నిజమేనని భావించారు. సినీ వర్గాలు షాక్ అవుతున్నాయి. అయితే.. స్విమ్మింగ్ పూల్ వద్ద మరో మహిళ చేసిన ఫోటోషూట్ వీడియోలను తీసుకుని, వాటికి ఏఐ డీప్‌టెక్నాలజీతో రుక్మిణి ముఖాన్ని జతచేసి ఫేక్ కంటెంట్‌గా రూపొందించినట్లు బయటపడింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, రుక్మిణి వసంత్ స్వయంగా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ వివాదంపై రుక్మిణి వసంత్ స్వయంగా తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా క్లారిటీ ఇస్తూ, "నా పేరుతో ప్రచారం అవుతున్న ఫోటోలు, వీడియోలు పూర్తిగా నకిలీవి. అవి ఏఐ సాయంతో తయారు చేసిన ఫేక్ కంటెంట్. వాటికి నాతో ఎలాంటి సంబంధం లేదు" అని స్పష్టం చేశారు. ఈ రకమైన మానిప్యులేటెడ్ కంటెంట్ సృష్టించడం చాలా బాధ్యతారాహిత్యమని, ఇది తన వ్యక్తిగత గోప్యతపై తీవ్రమైన దాడి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక్కడితో ఆగకుండా రుక్మిణి ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తన లీగల్ టీమ్‌తో కలిసి సైబర్ క్రైమ్ అధికారులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఫేక్ వీడియోలను రూపొందించిన వారితో పాటు, వాటిని కావాలనే సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేస్తున్న వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 'ఇలాంటి కంటెంట్‌ను పంచుకోవడం కూడా నేరమే' అంటూ నెటిజన్లను హెచ్చరించారు.
ఈ ఘటనతో మరోసారి ఏఐ డీప్‌ఫేక్ టెక్నాలజీ ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కూడా రష్మిక మందన్నా, పూజ హెగ్డే వంటి ప్రముఖ హీరోయిన్లు ఇలాంటి ఫేక్ వీడియోల బారిన పడ్డారు. ఇప్పుడు అదే పరిస్థితిని రుక్మిణి ఎదుర్కోవాల్సి రావడం సినీ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ వేగంగా వ్యాపించడం వల్ల ఇలాంటి ఘటనలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అభిమానులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుక్మిణి వసంత్ ఇమేజ్‌ను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఈ ఫేక్ వీడియోలను సృష్టించారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో, ఆమె తీసుకున్న లీగల్ యాక్షన్‌కు మద్దతు తెలుపుతున్నారు. "ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications




