Rukmini Vasanth Remuneration: టాక్సిక్‌కి రుక్మిణి వసంత్ రెమ్యునరేషన్..యష్ మూవీకి పారితోషికం ఎన్ని కోట్లంటే?
చిన్నా చితకా సినిమాలతో నటిగా నిలదొక్కుకుని నేడు పాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకున్నారు రుక్మిణి వసంత్. అగ్రహీరోల సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్తున్నారు ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్టార్ హీరోలకు ఫేవరెట్ ఛాయిస్‌గా మారారు రుక్మిణి. ప్రస్తుతం కన్నడ సూపర్‌స్టార్ యష్ సరసన నటించిన టాక్సిక్‌లో రుక్మిణి ఎలాంటి రోల్ పోషించిందోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టాక్సిక్ కోసం రుక్మిణి రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
పాన్ ఇండియా హీరోయిన్‌గా
కన్నడ, హిందీలలో ఓ మాదిరి చిత్రాల్లో నటిస్తూ వచ్చారు రుక్మిణి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం ద్వారా తెలుగు వారిని కూడా పలకరించింది. ఈ దశలో తమిళంలో ఏస్, మదరాసి చిత్రాలతో లైమ్ లైట్‌లోకి వచ్చిన రుక్మిణికి రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ 1 మూవీ బ్రేక్ ఇవ్వడంతో పాటు పాన్ ఇండియా గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో అందంతో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె టాక్సిక్ కాకుండా మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న డ్రాగన్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

టాక్సిక్‌లో మెలిసాగా రుక్మిణి
ఇప్పుడు అందరి చూపు.. టాక్సిక్‌లో రుక్మిణి వసంత్ పాత్ర గురించే. కాంతార రేంజ్‌లోనే ఈ పాత్ర కూడా ఉందా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఈ సినిమాలో రుక్మిణి రోల్‌కి సంబంధించి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె మెలిసా అనే పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు. మోడ్రన్ డ్రెస్ ధరించి పబ్‌లో నడుచుకుంటూ వస్తున్న రుక్మిణి లుక్ అంచనాలను పెంచేసింది.
టాక్సిక్ బడ్జెట్ ఎంత?
కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో టాక్సిక్‌ను నిర్మిస్తున్నారు. మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యష్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఉగాది, రంజాన్, గుడిపర్వా వంటి పర్వదినాలను పురస్కరించుకుని మార్చి 19న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో టాక్సిక్ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.
రుక్మిణి వసంత్ రెమ్యునరేషన్ ఎంత?
సినిమా సినిమాకు తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతున్న రుక్మిణి వసంత్.. టాక్సిక్ మూవీ కోసం ఎన్ని కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఫిలింనగర్ వర్గాల చెబుతున్న దాని ప్రకారం.. టాక్సిక్ మూవీకి రుక్మిణి వసంత్ 1.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషికం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కాంతార చాప్టర్ 1కి గాను కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఏకంగా కోటి రూపాయలకు పైగా ఛార్జ్ చేస్తుండటం గమనార్హం. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











