‘మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అలా వర్కవుట్.. రక్షిత్ శెట్టితో అలాంటి ట్రయల్స్’
సప్త సాగరాలు దాటి సైడ్ A మూవీ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతోపాటు భారీ కలెక్షన్లను సాధించింది. ఆ సినిమాకు సీక్వెల్‌గా సప్తసాగరాలు దాటి సైడ్ బీ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో నటించిన రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్, చైత్ర, దర్శకుడు హేమంత్ రావు తదితరులు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. ఈ వేడుకలో అవసరాల శ్రీనివాస్, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్, నిర్మాత వివేక్ కూచిబోట్ల తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 17వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించిన విషయాలను టీమ్ పంచుకొన్నారు. ఈ సందర్బంగా హీరోయిన్లు రుక్మిణి, చైత్ర మాట్లాడుతూ..
సప్త సాగరాలు దాటి సైడ్ ఏ సినిమాకు తెలంగాణ, ఆంధ్రా ప్రేక్షకుల ఇచ్చిన రెస్సాన్స్ అనూహ్యంగా ఉంది. మా సినిమాపై ప్రేమను కురిపించారు. మీ హృదయాల్లో ప్రియా, మను పాత్రలను పెట్టుకొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. సినిమాపై ఆదరణ కురిపించినందుకు గర్వంగా ఉంది. ఈ సినిమాను మీ వద్దకు తీసుకొస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, వివేక్ కూచిభొట్లకు ధన్యవాదాలు అని అన్నారు.

సప్త సాగరాలు దాటి సైడ్ చిత్రంలోని ప్రియ పాత్రలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఆ పాత్రలో ఉండే రొమాంటిక్, ఎమోషనల్ మూమెంట్స్‌ను బాగా ఎంజాయ్ చేశాను. పార్ట్ 1 లో ఓ రిలేషన్‌షిప్‌తో నా పాత్ర చాలా క్యూట్‌గా ఉంటుంది. మను, ప్రియ పాత్రల మధ్య రిలేషన్ చాలా క్యూట్‌గా ఉంది. ఆ పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీని డెవలప్ చేయడానికి వర్క్‌షాప్స్ చేశాం అని హీరోయిన్ రుక్మిణి చెప్పారు.
సప్తసాగరాలు దాటి సినిమా వర్క్ షాప్ తర్వాత చాలా చేసిన ట్రయల్స్ ద్వారా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ఈ రెండు సినిమాల వల్ల నేను నటిగా నిరూపించుకొనే అవకాశం లభించింది. నటిగా నాకు నేను ప్రూవ్ చేసుకొన్నాను. నటిగా నేను ఎదిగాను. సైడ్ బీ మూవీలో ఇంటెన్సిటీ, పాత్రలో ఉండే ఎమోషన్స్ నాకు ఛాలెంజింగ్‌గా అనిపించాయి అని రుక్మిణి చెప్పారు.

సప్త సాగరాలు దాటి సినిమాల వల్ల నేను నటిగా ఫెర్ఫార్మెన్స్‌ను కమ్యూనికేట్ చేశాను. నా సహచర నటులు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల నేను ప్రేక్షకులకు మంచి ఫీల్ కలిగించే నటనను ప్రదర్శించానని అనుకొంటున్నాను. సప్త సాగరాలు దాటి సినిమా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చిన మూవీ అని రుక్మిణి చెప్పింది.
రుక్మిణి వసంత్ కెరీర్ విషయానికి వస్తే.. కన్నడ సినీ పరిశ్రమలో బీర్బల్ ట్రయాలజీ కేస్ 1, సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సప్త సాగరాలు దాటి సైడ్ బీ, బానదరియాల్లీ చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం భగీరథ, భైరతీ రంగల్ సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో అవకాశాలు వచ్చాయని చెప్పారు. త్వరలోనే అధికారికంగా తెలియజేస్తానని చెప్పారు.


Click it and Unblock the Notifications











