ఎన్టీఆర్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో వైరల్.. ఆ పని చేయలేక ఇబ్బంది..

కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ సమయంలోనే పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ రుక్మిణి వసంత్. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్‌లతో ఫుల్ బిజీగా మారింది. 'సప్త సాగరాలు దాటి' సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ బ్యూటీ, ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రుక్మిణి యాక్టివ్‌గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో ఫ్యాన్స్‌ను అలరిస్తూ ట్రెండ్‌లో ఉంటోంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

Also Read
పెద్దిలో ఆ ఎపిసోడ్ హైలైట్.. ఉప్పెన కంటే 100 రెట్లు ట్విస్ట్: రామ్ చరణ్
పెద్దిలో ఆ ఎపిసోడ్ హైలైట్.. ఉప్పెన కంటే 100 రెట్లు ట్విస్ట్: రామ్ చరణ్

ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే ఆమె కెరీర్ ఎంత వేగంగా దూసుకెళ్తుందో అర్థమవుతుంది. ముఖ్యంగా కాంతార: చాప్టర్ 1 సినిమాలో హీరోయిన్‌గా నటించడం ఆమె కెరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారింది. దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీలో యువరాణి పాత్రలో ఆమె కనిపించింది.

Recommended For You
30 ఏళ్ల తర్వాత రివర్స్ సీన్... పవన్‌పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్!
30 ఏళ్ల తర్వాత రివర్స్ సీన్... పవన్‌పై చిరంజీవి ఎమోషనల్ కామెంట్!
Rukmini Vasanth Viral Video Trends Amid Rising Pan-India Film Projects Buzz

అంతేకాదు, టాలీవుడ్‌లో కూడా ఆమెకు భారీ అవకాశాలు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'డ్రాగన్' సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక కావడం ఆమె క్రేజ్‌ను మరింత పెంచింది. అదేవిధంగా, యశ్ - గీతూ మోహన్ దాస్ కాంబినేషన్‌లో రాబోతున్న మరో పాన్ ఇండియా టాక్సిక్ సినిమాలో ఇలా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ రుక్మిణి ఫుల్ స్వింగ్‌లో ఉంది.

You May Also Like
వాడిలో 1% డెడికేషన్ ఉన్నా చాలు.. మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని - బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
వాడిలో 1% డెడికేషన్ ఉన్నా చాలు.. మిస్ యూనివర్స్ అయ్యేదాన్ని - బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

వివరాల్లోకి వెళ్తే.. ఓ హోటల్ రూమ్‌లో తన ఫ్రెండ్‌తో కలిసి ఉన్న సమయంలో తీసిన వీడియోగా ఇది ప్రచారంలోకి వచ్చింది. రూమ్ ఖాళీ చేసే సమయంలో తన దుస్తులను సూట్‌కేస్‌లో సర్దుతున్న రుక్మిణి, లగేజ్ ఎక్కువ కావడంతో జిప్ పెట్టేందుకు కాస్త ఇబ్బంది పడింది. ఈ క్రమంలో పొట్టి డ్రెస్‌లో కనిపించిన ఆమె, జిప్ పెట్టడానికి ప్రయత్నిస్తూ కాస్త కష్టపడినట్టు వీడియోలో కనిపిస్తోంది. చివరికి సూట్‌కేస్ క్లోజ్ చేసిన తర్వాత "నేను సాధించాను" అంటూ ఆనందంగా స్పందించడం నెటిజెన్స్ దృష్టిని ఆకర్షించింది.

సుడిగాలి సుధీర్ మరో కొత్త సినిమా .. ఆ బిగ్‌బాస్ బ్యూటీ హీరోయిన్‌గా..
సుడిగాలి సుధీర్ మరో కొత్త సినిమా .. ఆ బిగ్‌బాస్ బ్యూటీ హీరోయిన్‌గా..

ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో వివిధ రకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఇది సాధారణ మోమెంట్ అని భావిస్తుంటే, మరికొందరు ఆమె గ్లామర్‌ను ప్రశంసిస్తున్నారు. "సూట్‌కేస్ సంగతి పక్కన పెడితే, రుక్మిణి యాక్షన్ అదిరిపోయాయి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా ఒకవైపు భారీ సినిమాలతో కెరీర్ పీక్‌లో ఉండగా, మరోవైపు సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతూ రుక్మిణి వసంత్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ప్రాజెక్ట్స్‌తో ఆమె స్టార్‌డమ్ మరింత పెరగడం ఖాయం అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

Read more about: rukmini vasanth dragon ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X