పాయల్ రాజ్‌పుత్ గురించి ఆ రూమర్స్ నిజం కాదు!
ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టిన పాయల్ రాజ్ పుత్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. యువతలో ఈ పంజాబీ భామకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.ఫ్యూచర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అంటూ అంచనాలు కూడా మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఆర్ఎక్స్ 100 తరువాత పాయల్ రాజ్ పుత్ మాస్ మహారాజ రవితేజ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. విఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు.
సైంటిఫిక్ అంశాలతో థ్రిల్లర్ జోనర్లో ఈ చిత్రం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. పాయల్ రాజ్ పుత్ పాత్ర గురించి కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పాయల్ రాజ్ పుత్ ఈ చిత్రంలో చూపు, వినికిడి సరిగా లేని యువతిగా నటించబోతోందంటూ ప్రచారం జరుగుతోంది. కానీ ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సమాచారం. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే అట.

సాధారణ యువతిగానే ఈ చిత్రంలో పాయల్ రాజ్ పుత్ నటిస్తుందట. ఇంకా దర్శకుడు కథపై కసరత్తు చేస్తున్నాడని, స్క్రిప్ట్ వర్క ఓ కొలిక్కి వచ్చాక సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నన్ను దోచుకుందువటే ఫేమ్ నభ నటేష్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











