వల్గారిటీ, బూతులు లేవు... మీ ఇంటి ఆడపిల్లను అనుకుని రండి: హీరోయిన్ విన్నపం
బెస్ట్‌విన్ ప్రొడక్షన్ బ్యానర్ పై భీమినేని సురేష్, జి.రామకృష్ణారావు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'రుణం'. ఎస్.గుండ్రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇద్దరి స్నేహితులు ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడంతో వారి జీవితాల్లో జరిగే సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.
గోపికృష్ణ, మహేంద్ర షిల్పా, ప్రియాంక అగస్థిన్ నటీనటులుగా నటించారు. షూటింగుతో పాటు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఫిలింఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ఆడియో సక్సెస్ మీట్లో హీరోయిన్ ప్రియాంక అగస్టిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

బూతులు, వల్గారిటీ, లిప్ లాక్ సీన్లు లేవు
‘‘ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే... అంతా కొత్తవారితో సినిమా చేస్తున్నపుడు సేఫ్ జోన్లో ఉండేలా సినిమా ప్లాన్ చేస్తారు. అందుకే వల్గారిటీ, బూతు సీన్లు, లిప్ లాక్ సీన్లు ఉండేలా సీన్లు డిజైన్ చేస్తారు. అవి చూడటానికైనా సినిమాకు జనాలు వస్తారనేది వారి నమ్మకం. కానీ ‘రుణం'లో అలాంటి ఏమీ లేవని గర్వంగా చెప్పగలను. ఈ సినిమాలో నేను ఉన్నందుకు సంతోషంగా ఉంది.'' అని ప్రియాంక అగస్టిన్ తెలిపారు.

సినిమా ద్వారా మంచి సందేశం
‘‘అడల్ట్ కంటెంట్ లేకుండా ప్రేక్షకులకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తీసిన చిత్రమిది. మార్కెటింగ్ కోసం వెంపర్లాడకుండా సినిమా ద్వారా ఏదైతే చూపించాలనుకున్నారో అదే చూపించారు. డబ్బే ధ్యేయంగా సినిమా చేయకుండా ఒక మంచి సినిమా ప్రేక్షకుల ముందుకు తెచ్చారు.'' అని ప్రియాంక అగస్థిన్ తెలిపారు.

చిన్న ఫిల్మ్, ఎందుకు టిక్కెట్ కొనుక్కుని వెళ్లాలి అని ఆలోచించే వారికి
ఇది చిన్న ఫిల్మ్, ఎందుకు టిక్కెట్ కొనుక్కుని వెళ్లాలి అని ఆలోచించే వారికి ఒకే విషయం చెబుతాను. పెద్ద సినిమా కంటే పది రెట్లు ఎక్కువ కష్టాలు ఈ చిన్న చిత్రాలకు ఉంటాయి. ఇక్కడి వరకు మేము రావడానికి చాలా కష్టపడ్డాం. నేను మాత్రమే కాదు టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత దూరం వచ్చాం. మా లాంటి వారిని ప్రోత్సహించడానికైనా సినిమా చూడాలని కోరుతున్నట్లు అగస్థిన్ అగస్టిన్ తెలిపారు.

నేను మీ ఇంటి ఆడపిల్లను అనుకుని చూడండి
‘‘ఒక మంచి సినిమా చేశామనే సంతోషం ఉంది. కష్టపడి పని చేసిన మాకు మేలు జరుగుతుందని భావిస్తున్నాం. ఏప్రిల్ 12న సినిమా వస్తోంది. నేను మీ ఇంటి ఆడపిల్లను అనుకుని వెళ్లి చూడండి. మీకు తప్పకుండా సినిమా నచ్చుతుంది. దయచేసి రివ్యూలు చూసి జడ్జ్ చేయవద్దు'' అని ప్రియాంక అగస్థిన్ కోరారు.


Click it and Unblock the Notifications











