Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అప్పుడే ఐటమ్ సాంగ్స్ మొదలుపెట్టేస్తున్న ఆర్ఎక్స్ 100 బ్యూటీ.. ఎవరి సినిమా అంటే!
బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఆర్ఎక్స్ 100 చిత్రంలో పంజాబీ భామ పాయల్ రాజ్ ఫుట్ హీరోయిన్ గా నటించింది. ఈ అమ్మడి బోల్డ్ పెర్ఫామెన్స్ కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో తరువాత పాయల్ కు తెలుగు తమిళ భాషల్లో అవకాశాలు వెల్లువలా వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఆర్ఎక్స్ 100 తరువాత పాయల్ మాత్రం కేవలం ఒక్క సినిమాకే సైన్ చేసింది.
భాను శంకర్ దర్శత్వంలో పాయల్ రాజ్ పుత్ కొత్త చిత్రం ఉండబోతోంది. ఇదిలా ఉండగా పాయల్ అప్పుడే ఐటెం సాంగ్స్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తేజ, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్.
ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు పాయల్ ఓకె చెప్పినట్లు వార్తలు వవస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో పాయల్ బోల్డ్ పెర్ఫామెన్స్ తో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రంలో పాయల్ టాలీవుడ్ లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది.