For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లైన ఆరు నెలలకే తల్లైన ప్రభాస్ హీరోయిన్: అప్పుడే అందాలు చూపిస్తూ సెల్ఫీ

  |

  సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా రంగానికి చెందిన వాళ్లు తెగ హైలైట్ అవుతున్నారు. తరచూ వాళ్ల పర్సనల్ విషయాలను షేర్ చేయడమో.. ఫొటోలు, వీడియోలకు వదలడో వంటివి చేసి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. మరీ ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లు ఇంటర్నెట్‌ వల్ల దేశ వ్యాప్తంగా మరింత పాపులర్ అవుతున్నారు. అలా కొన్నేళ్ల క్రితమే ఫేమస్ అయింది ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్, 'సాహో' ఫేం ఎవిలిన్ శర్మ. సుదీర్ఘమైన కెరీర్‌లో ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా.. గుర్తింపు మాత్రం భారీగా వచ్చింది. ఇక, ఈ మధ్య కాలంలోనే తల్లైన ఈ అమ్మడు.. తాజాగా సోషల్ మీడియాలో ఓ హాట్ సెల్ఫీని షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి మరి!

  రెండు దేశాల్లోనూ ఫుల్ ఫేమస్

  రెండు దేశాల్లోనూ ఫుల్ ఫేమస్


  చాలా కాలం క్రితమే ఇండియాలో ఫేమస్ అయిన వారిలో ఎవిలిన్ శర్మ ఒకరు. దీనికి కారణం ఆమె తండ్రిది ఇండియా కాగా, తల్లిది జర్మనీ కావడమే. అందుకే రెండు దేశాల సంస్కృతులతో ఆమె ప్రయాణం సాగించింది. ఈ క్రమంలోనే జర్మనీలోనే విద్యాభ్యాసం పూర్తి చేయడంతో పాటు అక్కడే మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. ఆ తర్వాత ఇండియాకు వచ్చి.. ఇక్కడా ఫేమస్ అయింది.

  తల్లైన తర్వాత మరో యాక్టర్‌తో హీరోయిన్ ఎఫైర్: బెడ్‌పై రొమాన్స్ చేసే పిక్ వైరల్

  హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లోకి

  హాలీవుడ్ నుంచి బాలీవుడ్‌లోకి


  మోడల్‌గా చేస్తోన్న సమయంలోనే ఎలివిన్ శర్మ 'టర్న్ లెఫ్ట్' అనే ఇంగ్లీష్ చిత్రంతో హాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. 2006లో విడుదలైన ఈ మూవీతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఇది వచ్చిన ఆరేళ్ల తర్వాత అంటే 2012లో 'ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్' అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.

  ప్రభాస్ సినిమాతో టాలీవుడ్‌కి

  ప్రభాస్ సినిమాతో టాలీవుడ్‌కి

  బాలీవుడ్‌లో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ సత్తా చాటుతోన్న సమయంలోనే ఎలివిన్ శర్మ.. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సాహో'లో కీలక పాత్రను పోషించింది. తద్వారా టాలీవుడ్‌లోనూ అడుగు పెట్టింది. ఇక, ఈ సినిమా చేస్తోన్న సమయంలో ఈ అమ్మడు హైదరాబాద్‌లో హల్‌చల్ చేసింది. అలాగే, ప్రభాస్ అంటే ఇష్టమని చెబుతూ అతడితో ఫొటో కూడా దిగింది.

  పొట్టి డ్రెస్‌తో షాకిచ్చిన భూమిక: వామ్మో అలా పడుకుని అందాల విందు

  చాలా గ్యాప్ తర్వాతనే పెళ్లాడి

  చాలా గ్యాప్ తర్వాతనే పెళ్లాడి


  ప్రభాస్ సినిమాలో నటించిన తర్వాత ఎవిలిన్ శర్మ తన ప్రియుడు తుషాన్ భిండీతో నిశ్చితార్థం చేసుకుంది. వాస్తవానికి వీళ్లిద్దరూ అంతకు ముందు నుంచే డేటింగ్ చేస్తున్నారు. కానీ, 2019లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీని తర్వాత ఎలివిన్ శర్మ సినిమాలకు దూరం అయిపోయింది. ఇక, గత ఏడాది జూన్‌లో వీళ్లిద్దరూ నిరాడంభరంగా జరిగిన వేడుకలో వివాహం చేసుకున్నారు.

  పండంటి బిడ్డకు తల్లైన భామ

  పండంటి బిడ్డకు తల్లైన భామ


  ఎవిలిన్ శర్మ పెళ్లి చేసుకునే సమయానికే తనకు కాబోయే భర్త కారణంగా గర్భం దాల్చిన విషయం అప్పట్లో సంచలనం అయింది. అందుకే ఈ అమ్మడు పెళ్లైన ఆరు నెలలకే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ఇక, అప్పటి నుంచి తన కుమార్తెతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. దీంతో సినిమాలకు దూరమైంది.

  స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన ప్రియాంక: అబ్బో తడిచిన అందాలను చూపిస్తూ!

  సోషల్ మీడియాలో సందడిగా

  సోషల్ మీడియాలో సందడిగా


  చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాలు చేసినా.. ఈ మధ్య ఖాళీగానే ఉంటోన్నా ఎవిలిన్ శర్మ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. దీని ద్వారానే ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలతో పాటు కెరీర్‌ గురించిన ప్రతి విషయాన్ని ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇలా సినిమాలు చేయకున్నా ఫ్యాన్స్‌తో మాత్రం టచ్‌లోనే ఉంటోంది.

   హాట్ సెల్ఫీ షేర్ చేసిన శర్మ

  హాట్ సెల్ఫీ షేర్ చేసిన శర్మ


  సోషల్ మీడియాలో ఎవిలిన్ శర్మ అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఎద అందాలతో రెచ్చగొట్టేలా దిగిన సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఆమె క్లీవేజ్ షో హైలైట్ అవుతోంది. ఫలితంగా ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇది విపరీతంగా వైరల్ అయిపోతోంది.

  English summary
  Saaho Fame Evelyn Sharma Very Active in Social Media. Now She Shared Hot Selfie In Instagram. This Pic Goes Viral In Internet.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X