ప్రభాస్ అలాంటోడే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

The Rajasaab: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా, యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ది రాజాసాబ్( The Rajasaab). ఈ మూవీ విడుదలకు సమయం దగ్గరపడుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఏమన్నారంటే?

ది రాజాసాబ్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న వేళ.. ప్రభాస్ 2019లో నటించిన బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ 'సాహో'కు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ఒకటి మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్.. ప్రభాస్ గురించి చేసిన వ్యాఖ్యలు అభిమానులను మరోసారి ఆకట్టుకుంటున్నాయి.

Saaho Interview Resurfaces as Shraddha Kapoor Praises Prabhas Ahead of The Rajasaab Release

శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. సాహో సినిమాలో ప్రభాస్‌తో కలిసి పని చేయడానికి ముందు నేను చాలా నర్వస్‌గా ఉన్నాను. బాహుబలి తర్వాత ఆయన చేసిన తొలి సినిమా అది. అంత పెద్ద విజయం తర్వాత ఆయనతో కలిసి నటించడం పెద్ద బాధ్యతగా అనిపించింది. కానీ, ప్రభాస్ నా నర్వస్‌ను అర్థం చేసుకుని నాతో మాట్లాడారు. సెట్‌పై నాకు పూర్తి కంఫర్ట్ ఇచ్చారు'అంటూ ప్రభాస్ ను కొనియాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.'ప్రభాస్ నిజంగా గ్రేట్ హ్యూమన్ బీయింగ్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ది రాజాసాబ్ హైప్ పెరుగుతున్న వేళ ఈ వీడియో మరింత ఎక్సైట్మెంట్‌ను తీసుకొచ్చిందని చెప్పాలి.

2019లో విడుదలైన సాహోను దర్శకుడు సుజీత్ తెరకెక్కించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటించిన ఈ సినిమా ప్రభాస్ హిందీ డెబ్యూ కూడా. భారీ బడ్జెట్, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా అప్పట్లో భారీ చర్చకు దారి తీసింది. ఫలితం మిక్స్‌డ్ అయినా, ప్రభాస్-శ్రద్ధా జోడీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. గతంలో కూడా శ్రద్ధా కపూర్ ప్రభాస్‌ను 'చాలా స్వీట్, జెంటిల్‌మన్, వెల్‌కమింగ్ పర్సన్'అని, సెట్‌పై అందరికీ ఇన్‌స్పిరేషన్'అంటూ ప్రశంసించారు.

ఇక ప్రభాస్ కొత్త సినిమా ది రాజాసాబ్ విషయానికి వస్తే... ఇది రొమాంటిక్ హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ. పిపుల్స్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory) బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక థమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, సింగిల్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, శ్రద్ధా కపూర్ కెరీర్ కూడా హై నోట్‌లో కొనసాగుతోంది. గతేడాది బాలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన స్త్రీ 2 తర్వాత ఆమె క్రేజ్ ఆకాశాన్ని తాకింది. సోషల్ మీడియాలో ఫాలోవర్ల విషయంలో కూడా శ్రద్ధా కొత్త రికార్డులు సృష్టించింది. ఒక దశలో ప్రధాని నరేంద్ర మోడీ, ప్రియాంక చోప్రాలకంటే ఎక్కువ ఫాలోవర్లతో భారతదేశంలోనే టాప్ సినీ సెలబ్రిటీగా నిలిచింది. అయితే స్త్రీ 2 ఘన విజయం తర్వాత కూడా ఆమె కొత్త ప్రాజెక్ట్స్ విషయంలో కాస్త స్లోగా అడుగులు వేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

ఒకవైపు ది రాజాసాబ్‌పై భారీ అంచనాలు, మరోవైపు సాహో రోజుల నాటి శ్రద్ధా కపూర్ కామెంట్స్ వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ వైరల్ ఇంటర్వ్యూ ది రాజాసాబ్‌కు మరింత పాజిటివ్ బజ్ తీసుకొచ్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమాలతో పోటీ పడి, ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తోందో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X