Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్: వచ్చిరాని తెలుగులో మాట్లాడి ఆకట్టుకున్న శ్రద్ద కపూర్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'సాహో' మరో పది రోజుల్లో(ఆగస్టు 30) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాహుబలి 2 తర్వాత దాదాపు రెండేళ్లు వెయిట్ చేసిన అభిమానుల నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ భారీ చిత్రాన్ని ఐదు భాషల్లో విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం(ఆగస్టు 18) హైదరాబాద్‌లో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో సాహో మూవీలో ఉపయోగించిన వస్తువులు, వాహనాలు కూడా ప్రదర్శనకు ఉంచడం గమనార్హం. వేలాది మంది అభిమానులు ఈ వేడుకలో పాల్గొనేందుకు తరలి వచ్చారు.
Photo Gallery: 'సాహో' ప్రీ రిలీజ్ ఈవెంట్
ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది సాహో భామ శ్రద్ద కపూర్. ఈ సందర్బంగా సాహో వేదికపై వచ్చిరాని తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అని తెలుగులో చెప్పి.. వచ్చేసారి ఖచ్చితంగా తెలుగులో మాట్లాడతా అని చెబుతూ తన భావాలను ఇంగ్లీష్‌లో చెప్పింది శ్రద్ధ కపూర్.
హైదరాబాద్ నా సెకండ్ హోమ్ టౌన్ అయింది. మీ అందరు చూపిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. సాహో యూనిట్‌తో పని చేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. నా తొలి తెలుగు సినిమాలో మీ ఫేవరేట్ యాక్టర్ ప్రభాస్ తో నటించడం రియల్లీ అమేజింగ్ అంటూ తన ప్రసంగం ముగించింది శ్రద్ద కపూర్.
యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్రమ్‌లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సాహో చిత్రాన్ని నిర్మించారు. ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో రెబల్‌స్టార్ ప్రభాస్ సరసన శ్రధ్ధాకపూర్ నటించగా జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిషోర్, ప్రకాష్ బెల్వాది, ఎవిలిన్ శర్మ, చుంకి పాండే, మందిరా బేడి, మహేష్ మంజ్రేఖర్, టిను ఆనంద్, శరత్ లోహితష్వా తదితరులు కీలక పాత్రలు పోషించారు.