twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సాహో’ చిత్రానికి శ్రద్ధా కపూర్ ఎంత తీసుకుంది?

    |

    ప్రభాస్, శ్రద్ధా కపూర్ హీరో హీరోయిన్లుగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'సాహో'. ఆగస్టు 30న విడుదల కాబోతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ వారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇది బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ.

    శ్రద్దా కపూర్ ఈ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ఇందులో ఆమె కేవలం పాటలకే పరిమితం కాకుండా నటనకు ప్రధాన్యం ఉన్న పాత్ర పోషించారు. హీరో ప్రభాస్‌తో కలిసి యాక్షన్ సీన్లు చేసి అలరించారు. ఈ సినిమా కోసం దాదాపు 2 సంవత్సరాల పాటు పని చేశారు.

     Saaho: Shraddha Kapoor Remuneration is not Rs. 7 cr

    ఇంత పెద్ద బడ్జెట్ మూవీ, ఇన్ని ఎక్కువ రోజులు పని చేయడంతో పాటు ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా ఆమె ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇవన్నీ చేసినందుకు శ్రద్ధా కపూర్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అనేది హాట్ టాపిక్ అయింది. అన్నింటికీ కలిపి శ్రద్ధా కపూర్ రూ. 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా ఓ రూమర్ తాజాగా ప్రచారంలోకి వచ్చింది.

    అయితే శ్రద్ధా కపూర్ రూ. 7 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంది అనే వార్తలో నిజం లేదు అంటున్నారు. ఆమె కంటే ముందు నిర్మాతలు ఈ సినిమా కోసం కత్రినా కైఫ్‌ను సంప్రదించారని, రూ. 5 కోట్లు డిమాండ్ చేయడంతో వద్దనుకున్నారని, అలాంటిది శ్రద్ధా కపూర్‌కు రూ. 7 కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడం ఏమిటి? కొందరు ప్రశ్నిస్తున్నారు.

    శ్రద్ధా కపూర్ పీఆర్ టీమ్ ఇలాంటి రూమర్స్ తెరపైకి తెచ్చి ఉండవచ్చు అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. సాహో మూవీకి శ్రద్ధా కపూర్ రూ. 7 కోట్ల తీసుకుందనే ప్రచారం చేయడం ద్వారా ఆమె తర్వాత చేయబోయే బాలీవుడ్ సినిమాలకు సాధారణంగా తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ డిమాండ్ చేసే అవకాశం ఉందని టాక్.

    ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 'సాహో' మూవీకి శ్రద్ధా కపూర్ రూ. 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 'సాహో' భారీ విజయం సాధిస్తే ఆమె రేంజి పెరగడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు.

    English summary
    According to reports, heroine Shraddha Kapoor has been paid a sum of Rs 7 crore for her role in the film Saaho. However, there was no truth in the news and she was paid Rs. 3 cr, reports say.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X