సిక్స్ ప్యాక్‌తో హడలెత్తిస్తున్న సాయిధరమ్ తేజ్ హీరోయిన్..
బ్రెజిల్ మోడల్, నటి లారిస్సా బొనెసీ అందంతోపాటు శరీరాకృతి దృష్టి పెట్టినట్టు కనిపిస్తున్నది. ఇటీవల తెలుగులో రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ జిమ్‌లో చెమటలు కక్కుతున్నది. తాజాగా ఓ బీటీఎస్ వీడియోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. లారిస్సా బోనెసీ ప్రస్తుతం సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాదా అనే అనుమానం కలిగిస్తున్నది.
వీడియోలో కనిపిస్తున్న ప్రకారం.. భారీ మొత్తంలో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ శరీరాన్ని మరింత చురుకుగా చేస్తూ కనిపించారు. తన కోచ్ చెప్పిన ప్రకారం వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కనిపించారు.

ఇక లారిస్సా కెరీర్ విషయానికి వస్తే.. సాయిధరమ్ నటించిన తిక్క చిత్రంతో ప్రేక్షకులకు చేరువయ్యారు. ప్రస్తుతం నెక్ట్స్ ఏంటీ?, రాకెట్ రాజా చిత్రాల్లో నటిస్తున్నారు.అలాగే బాలీవుడ్‌లో గురు రాంధ్వా దర్శకత్వం వహించే సల్మాన్ ఖాన్‌తో సుర్మా సుర్మా, ఇంకా టైగర్ ష్రాఫ్‌తో ఆర్ యూ కమింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











