Larissa Bonesi: న్యూడ్​ ఫొటోతో దర్శనమిచ్చిన సాయి ధరమ్ తేజ్ హీరోయిన్​.. పిక్​ వైరల్​

ఇటీవల కాలంలో న్యూడ్ ఫొటోల ట్రెండ్​ ఎక్కువైపోయింది. బాలీవుడ్ హీరో రణ్​వీర్ సింగ్ మొదలు పెట్టిన ఈ ట్రెండ్​ కొనసాగుతూనే ఉంది. రణ్​వీర్ సింగ్ న్యూడ్ ఫొటోషూట్​పై పలువురు సెలబ్రిటీలు ప్రశంసించగా.. ఎక్కువగా విమర్శల పాలైన విషయం తెలిసిందే. ఈ ఫొటోషూట్​పై ముంబై చెంబూరులో ఫిర్యాదు కూడా నమోదు కాగా, ఇటీవలే పోలీస్​ స్టేషన్​లో హాజరయ్యాడు రణ్​వీర్ సింగ్​. ఇక రణ్​వీర్ సింగ్​ తర్వాత విష్ణు విశాల్​ వంటి తదితర హీరోలు, హీరోయిన్లు సైతం న్యూడ్​ ఫొటోలు షేర్​ చేసి రచ్చలేపారు. ఇప్పుడు తాజాగా మరో బ్యూటీ న్యూడ్ పిక్​ షేర్ చేసి హాట్​ టాపిక్​గా మారింది.

అంతకుమించిన విమర్శలు..

అంతకుమించిన విమర్శలు..

బాలీవుడ్​ యంగ్​ అండ్ స్టార్​ హీరో రణ్​వీర్ సింగ్​ న్యూడ్​ ఫొటోషూట్​ రేపిన దుమారం అంతా ఇంతా కాదు. ఆ పిక్స్​ సోషల్​ మీడియాలో ఎంత వైరల్​ అయ్యాయో.. అంతకుమించి విమర్శలు పాలయ్యాడు రణ్​వీర్​ సింగ్. ఈ ఫొటోలు తమ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పోలీస్ స్టేషన్​ మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే.

ఫాలో అవుతున్న సెలబ్రిటీలు..

ఫాలో అవుతున్న సెలబ్రిటీలు..

అంతేకాకుండా ఇటీవల రణ్​వీర్ సింగ్ పోలీసులు వేసిన ప్రశ్నలను ఎదుర్కొనే పరిస్థితి కూడా వచ్చింది. ఇక ఇదిలా ఉంటే.. ఈ న్యూడ్ ఫొటోషూట్​ ట్రెండ్​ను ఇప్పటికే చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఫాలో అవుతూ తమ సోషల్​ మీడియాలో అకౌంట్​లలో పోస్ట్ చేశారు.

న్యూడ్​ బాటలోనే..

న్యూడ్​ బాటలోనే..

ఈ జాబితాలో ప్రముఖ క్రీడాకారిణి భర్త, హీరో విష్ణు విశాల్​తోపాటు బాలీవుడ్​ హీరోయిన్​ ఈషా గుప్తా పలువురు నటీనటులు ఉన్నారు. వీరి బాటలోనే మరో బ్యూటిఫుల్​ హీరోయిన్​ నడుస్తోంది. ఈ ట్రెండ్​ను కొనసాగించడం కోసమే అన్నట్లుగా న్యూడ్ ఫొటో దిగి ఇన్​స్టా గ్రామ్​ వేదికగా పంచుకుంది.

సాయిధరమ్ తేజ్ నటించిన..

సాయిధరమ్ తేజ్ నటించిన..

ఇంతకీ ఆ హీరోయిన్​ ఎవరో కాదు.. లారిస్సా బోనెసి. ఇలా చెప్తే అర్థం కాదు గానీ, సాయి ధరమ్​ తేజ్ హీరోయిన్​ అని చెప్పాలి. సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క మూవీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరోయిన్​గా చేసింది ఈ బ్యూటీనే. నార్మల్​గా ఫొటో దిగి షేర్ చేస్తే ఏం ఉంటుంది అనుకుందో ఏమో గానీ, ఇలా న్యూడ్ పిక్​తో దర్శనమిచ్చింది ఈ భామ.

చేతులతో కవర్​ చేస్తూ..

ఈ న్యూడ్​ ఫొటోషూట్​లో తన ఎద అందాలను చేతులతో కవర్​ చేస్తూ కనిపించింది లారిస్సా బోనెసి. అంతేకాకుండా ''నేను ఒక మిస్టరీలా ఉండాలనుకుంటున్నాను'' అని ఆ ఫొటోకు క్యాప్షన్​ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్​ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

అప్పట్లో రూమర్లు..

బ్రెజిలియన్​ మోడల్​ అయిన లారిస్సా బోనెసి.. సాయిధరమ్​ తేజ్ నటించిన తిక్క మూవీలో హీరోయిన్​గా చేసింది. అయితే అప్పట్లో సాయిధరమ్​ తేజ్​కు ఈ ముద్దుగుమ్మకు మధ్య ఏదో ఉందనే వార్తలు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా సాయిధరమ్ తేజ్​ రిపబ్లిక్ మూవీపై కూడా ఈ అమ్మడు స్పందించింది. కాగా లారిస్సా బోనేసి పలు హిందీ చిత్రాల్లో కూడా నటించి ఆకట్టుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X