‘లయని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఇంట్లో కూడా ఓకే , బ్రేకప్ ఎందుకైందంటే? ’

ప్రేమ ఎప్పుడు ఎవరిలో కలుగుతుందో ఎవరికీ తెలియదు. ఒకే రంగంలో పనిచేస్తున్న వారు ప్రేమించి పెళ్లి చేసుకోవడం సర్వసాధారణం . డాక్టర్లు డాక్టర్‌నే లవ్ ఆడినట్లు.. యాక్టర్ తోటి యాక్టర్‌ను పెళ్లి చేసుకోవడం కూడా అంతే కామన్. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఎందరో జంటలు తమ తోటి నటీమణులను వివాహం చేసుకున్నారు, చేసుకుంటున్నారు.. భవిష్యత్తులో చేసుకుంటారు కూడా. అయితే హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నా.. దానిని పెళ్లి పీటల దాకా తీసుకొచ్చిన వారు కొందరే. మధ్యలోనే బ్రేకప్ అయినవారు ఉన్నారు.

కాగా.. నువ్వేకావాలి చిత్రంలోని '' రా చిలక నువ్వే కావాలి '' అనే ఒక్క పాటతో పాపులర్ అయ్యారు సాయికిరణ్. అనంతరం హీరోగా మారి పలు సినిమాల్లో నటించారు. రావే నా చెలియా, డార్లింగ్ డార్లింగ్, మనసుంటే చాలు, ఆడంతే అదో టైపు, పెళ్లి కోసం వంటి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎందుకో ఆ జోష్ కొనసాగించలేకపోయారు.

sai kiran interesting comments about his marriage with heroine laya

ఈ నేపథ్యంలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సాయికిరణ్.. సుడి గుండాలు, కోయిలమ్మ, అభిలాష, మౌనరాగం, ఇంటి గుట్టు వంటి సీరియల్స్‌లో నటించారు. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మోస్ట్ బిజీగా ఉంటున్నారు సాయికిరణ్. మా టీవీలో ప్రసారమయ్యే గుప్పెడంత మనసు సీరియల్‌లో మహేంద్ర పాత్రలో నటించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఆయనకు కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. అది కూడా ఎవరితోనో తెలుసా సీనియర్ హీరోయిన్ లయతో.

వీరిద్దరూ కలిసి ప్రేమించు అనే సినిమాలో నటించగా.. ఈ జంటకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే లయ-సాయికిరణ్ ప్రేమించుకున్నారని , త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని మ్యాగజైన్స్‌లో గాసిప్స్ వచ్చేవి. కానీ దీనిపై ఇద్దరూ స్పందించలేదు. అయితే ఇన్నాళ్లకు సాయికిరణ్ క్లారిటీ ఇచ్చారు. లయ నేను కలిసి నటించిన ప్రేమించు సినిమా సక్సెస్ అయ్యిందని, మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, నటనను ప్రజలు కూడా మెచ్చుకున్నారని సాయికిరణ్ గుర్తుచేసుకున్నారు.

అటు లయ తన పక్కన చూడముచ్చటగా ఉండటంతో .. మేమిద్దరం ఒక్కటైతే బాగుంటుందని మా ఇంట్లోవాళ్లు భావించారని ఆయన తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్ స్వయంగా లయని పెళ్లి చేసుకోమని చెప్పడంతో తాను కూడా ఓకే చెప్పానని.. కానీ మా ఇద్దరి జాతకాలు కలవకపోవడంతో మా పెళ్లి పట్టాలెక్కలేదని సాయికిరణ్ తెలిపారు. తనతో పాటు ఇంట్లో వాళ్లు జాతకాలను బాగా విశ్వసిస్తామని.. అందుకే మరో మాట లేకుండా లయను పెళ్లి చేసుకోలేదని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సాయికిరణ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అనవసరంగా జాతకాలను నమ్మి లయను మిస్ చేసుకున్నారంటూ కొందరు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు.

sai kiran interesting comments about his marriage with heroine laya

ఇక.. లయ విషయానికి వస్తే స్వయంవరం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు లయ ఫేవరేట్‌గా మారిపోయారు. ప్రేమించు, మిస్సమ్మ, విజయేంద్రవర్మ, టాటా బిర్లా మధ్యలో లైలా వంటి చిత్రాల్లో నటించారు. హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్న టైంలోనే పెళ్లి చేసుకుని భర్తతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు లయ. అక్కడ ఐటీ ఉద్యోగంతో పాటు డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టి సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు.

కరోనా కారణంగా స్కూల్ మూసేసి సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ తెలుగువారిని మరోసారి పలకరించారు. దాదాపు రెండు దశాబ్ధాల విరామం తర్వాత టాలీవుడ్‌లో లయ రీ ఎంట్రీ ఇస్తున్నారు. నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు అనే మూవీలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు. మరోసారి ఆమె తెలుగు సినిమా పరిశ్రమలో తన మార్కు నటనను చూపిస్తుందా అని వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X