Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
సినిమాల కోసం అలా చేయలేను.. ఆ డ్రెస్ వేసుకోనని చెప్పా: సాయి పల్లవి
ఫిదా సినిమాతో టాలీవుడ్ జనాలకు బాగా దగ్గరైన భామ సాయి పల్లవి. లోకల్ మాస్ పిల్లగా ఆ సినిమాలో సాయి పల్లవి చేసిన రచ్చ ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిదాతో సాయి పల్లవి క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అందుకుముందు వరకు సాయి పల్లవి అంటే చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఎప్పుడైతే ఫిదా అనేసిందో వరుసగా ఆఫర్స్ అందుకోవడం స్టార్ట్ చేసింది.
సాయి పల్లవి ఉంటే చాలు..
సినిమాలో హీరోయిన్ అంటే గ్లామర్ పాత్రల కోసం మాత్రమే కాదు. యాక్టింగ్ స్కిల్స్ తోనే హీరోల కంటే హై రేంజ్ లో సినిమాకు మంచి క్రేజ్ తేగలరని నీరూపించింది. సాయి పల్లవి సినిమాలో ఉంటే చాలు అనే పరిస్థితికి నిర్మాతలు వచ్చారు అంటే ఆమెకు ఎలాంటి డిమాండ్ ఉందొ చెప్పనవసరం లేదు. అయితే ఈ కేరళ కుట్టి మాత్రం కేవలం తనకు నచ్చిన సినిమాలు మాత్రమే చేసుకుంటూ వెళుతోంది.
గ్లామర్ గీతకు దూరంగా..
సినిమా ప్రపంచంలో హీరోయిన్స్ పొట్టి దుస్తుల్లో, ఘాటుగా కనిపించడం కామన్ అయిపోయింది. గ్లామర్ రోల్స్ అంటూ అందాలను ఇష్టం వచ్చినట్లుగా అరబోయడం చాలా వరకు హీరోయిన్స్ కి అలవాటే.. అయితే సాయి పల్లవి మాత్రం ఇంతవరకు అలాంటి పాత్రలకు ఒప్పుకోలేదు. కేవలం ఒక న్యాచురల్ అమ్మాయిలా.. లంగా వోణిలో అలాగే చీరలో కనిపిస్తూ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేస్తోంది.
అలాంటి బట్టలు వేసుకొనని చెప్పేసిందట..
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు గ్లామర్ రోల్స్ పై అసలైన వివరణ ఇచ్చింది. శృతి మించిన వయ్యారాలు తెరపై చూపించడం తనకు అంతగా ఇష్టం ఉండదని చెబుతూ.. నాకు ఒక న్యాచురల్ కాలేజ్ అమ్మాయిలా కనిపించడం అంటేనే ఇష్టం, బిగుతుగా ఉండే పొట్టి డ్రెస్సులు వేసుకోవడం ఏ మాత్రం ఇష్టం ఉండదు. కొన్ని సినిమాల్లో అలాంటి డ్రెస్సులు వేసుకోమని అన్నారు. కానీ నేను వేసుకొనని నిర్మాతలకు చెప్పినట్లు ఫిదా బ్యూటీ తెలిపింది.
ఫిదాలో అలా ఎందుకు చేశానంటే..
ఫిదాలో ఒక సీన్ లో పొట్టిగా ఉండే బ్లాక్ స్లీవ్ లెస్ డ్రెస్సులో కనిపించడం జరిగింది. కానీ అది కథలో భాగమే. డైరెక్టర్ శేఖర్ కమ్ముల మేకింగ్ తెలుసు కాబట్టి పాత్ర కోసం అలా చేశానని అయితే మరోసారి అవుట్ ఫిట్ డ్రెస్సులు ఏ మాత్రం వేసుకొనని ఈ బ్యూటీ తెలిపింది. మధ్యలో కొన్ని హాట్ గ్లామర్ రోల్స్ చేయాలని ఆఫర్స్ వచ్చాయని అయితే వాటిని కూడా తాను వద్దనుకున్నట్లు చెప్పింది. అదే విదంగా ఆఫర్స్ కోసం తన సొంత నిర్ణయాలను మార్చుకోలేనని సాయి పల్లవి క్లారిటీగా వివరణ ఇచ్చింది.