Sai Pallavi: తెలుగబ్బాయితో పెళ్లి.. అప్పటి లోపు ఇద్దరు పిల్లలు.. సాయి పల్లవి లేటెస్ట్ కామెంట్స్
ఇటీవల కాలంలో నటనతోనే ఎక్కువగా ఆకట్టుకున్న హీరోయిన్ల లో సాయి పల్లవి నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అని చెప్పాలి. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర మాత్రం చాలా విభిన్నంగా ఉండేలా చేసుకుంటుంది. ఎంచుకునే కథలపై కూడా ప్రేక్షకులు ఒక బలమైన నమ్మకం అయితే ఉంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సాయి పల్లవి తన పెళ్లి గురించి పిల్లల గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

కథలో విషయంలో జాగ్రత్తలు
బ్యూటిఫుల్ హీరోయిన్ గా మంచి నటనతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న సాయి పల్లవి ఒక సినిమా చేస్తోంది అంటే తప్పకుండా అందులో ఏదో ఒక కొత్త తరహా పాయింట్ ఉంటుంది అని ప్రేక్షకులు బలమైన నమ్మకం ఏర్పడింది. మొదటి సినిమా నుంచి కూడా ప్రతి సినిమాలో కథలో చాలా బలంగా ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చింది.

నెంబర్ వన్ హీరోయిన్
సినిమా ప్రపంచంలో అందాల ఆరబోత ఎక్కువగా ఉంటేనే అవకాశాలు వస్తాయని ఓ వర్గం వారు నిత్యం కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాగే హీరోయిన్స్ కూడా గ్లామరస్ ఫోటోషూట్స్ తో నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. ఆ రూట్లో అవకాశాలు అందుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే సాయి పల్లవి మాత్రం గ్లామర్ తో కాకుండా టాలెంట్ తోనే అవకాశాలు ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఆ రూట్లో సాయి పల్లవి నెంబర్ వన్ స్థానంలో ఉంటుంది అనే చెప్పాలి.

తెలుగులోనే..
ఫిదా సినిమాతో తెలుగు వారికి దగ్గరైన సాయి పల్లవి ఆ తర్వాత పూర్తిగా తెలుగు అమ్మాయి అనేలా గుర్తింపు అందుకుంటోంది. ఆమె మలయాళం అమ్మాయి అని చాలామందికి క్లారిటీ ఇచ్చిన తర్వాత తెలిసింది. ఇక సాయి పల్లవి మొదటి సినిమా నుంచి కూడా తన సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పుకుంటూ వస్తోంది. తెలుగు నేర్చుకోవడం అంటే కూడా తనకు చాలా ఇష్టమని ఇప్పటికీ నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను అని చెబుతోంది.

నచ్చకపోతే..
ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో సాయి పల్లవి తన మ్యారేజ్ లైఫ్ అలాగే ఫ్యూచర్ లైఫ్ గురించి కూడా ఒక ప్రత్యేకమైన వివరణ ఇవ్వడం విశేషం. సినిమా ఇండస్ట్రీలో కల్చర్ వేరు మీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు ఎప్పుడు ప్రాబ్లం అవ్వలేదా అని అడిగినప్పుడు.. తనకు నచ్చిన పని ఎప్పుడూ చేయాలని అనుకోలేదని.. ఒక వేళ ఇక్కడ అలాంటి పరిస్థితి ఎదురైతే మాత్రం వెంటనే వెళ్లి తన చదువును కంటిన్యూ చేస్తాను అని చెప్పుకొచ్చింది.

తెలుగబ్బాయితో పెళ్లి
ఇక తరచుగా ఇంట్లో కూడా నేను తెలుగులో మాట్లాడుతూ ఉండగా మా కుటుంబ సభ్యులు తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకో అని కూడా సూచించారు. అయితే నాకు ఒకప్పుడు మాత్రం 23 ఏళ్లకు పెళ్లి అయిపోతుంది ఆ తర్వాత 30 లోపు ఇద్దరు పిల్లలు కూడా ఉంటారని అనుకున్నట్లు చెబుతూ అలా మాత్రం జరగలేదు అని వివరణ ఇచ్చింది.

అది తప్పు కాదు
ఇక సాధారణంగా హీరోయిన్స్ అనగానే పొట్టి బట్టలు గ్లామరస్ పాత్రలలో ఎక్కువగా కనిపిస్తారు అని.. అయితే మీ విషయంలో అలా కాకుండా ఆలోచిస్తారు అని అన్నప్పుడు సాయి పల్లవి ఈ విధంగా స్పందించింది. ఎప్పుడైతే చూసే విధానం మారుతుందో అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని.. అయితే పొట్టి బట్టలు వేసుకున్నంత మాత్రాన అది తప్పు అని కాదు.. అని కూడా సాయి పల్లవి తనదైన శైలిలో వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











