లిప్ కిస్ పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి.. అది శేఖర్ కమ్ముల ఐడియా.. ఇబ్బంది పెట్టకుండానే..

గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఇండియాలోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కూడా లవ్ స్టొరీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా సాయిపల్లవి డాన్స్ కూడా సినిమాలో చాలా హైలెట్ గా నిలిచాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక సరికొత్త డాన్స్ మూమెంట్స్ ఈ సినిమాలో కనిపించాయి అంటూ చాలామంది సెలబ్రిటీలు పాజిటివ్ గా కామెంట్ చేశారు. అయితే జీవితంలో ఎప్పుడు కూడా లిప్ లాక్ సీన్ చేయనని చెప్పిన సాయిపల్లవి ఈ సినిమాలో మాత్రం చాలా తెలివిగా ఆ సీన్ లో నటించింది. ఆ ఐడియా కూడా శేఖర్ కమ్ముల గారిదే అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.

ఇద్దరి కెమిస్ట్రీ హైలెట్

ఇద్దరి కెమిస్ట్రీ హైలెట్

నాగ చైతన్య సాయి పల్లవి ఇద్దరు కూడా సినిమాలో సరికొత్తగా కనిపించారనే చెప్పాలి. ముఖ్యంగా నాగచైతన్య అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా తనలోని నటుడిని వెలికి తీశాడు. ఎమోషనల్ సీన్స్ లో అయితే అతను చూపించిన హావభావాలు కూడా కంటతడి పెట్టించాయి. అలాగే సాయి పల్లవి తో చేసిన కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా సినిమాలో హైలెట్ గా నిలిచాయి.

 లిప్ లాక్ సీన్ అవసరమే..

లిప్ లాక్ సీన్ అవసరమే..

లవ్ స్టొరీ సినిమాలో సాయి పల్లవి నాగచైతన్య ఇద్దరు కూడా ముద్దు సన్నివేశాల్లో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే ఒక సీన్లో సాయిపల్లవి నిజంగానే నాగచైతన్య లిప్ కిస్ ఇచ్చినట్లుగా హైలెట్ చేశారు. ఇద్దరి మనస్సులలో అసలైన ప్రేమ చూపించాలి కాబట్టి ఆ సీన్ చాలా ముఖ్యమైనది. అందుకే లిప్-లాక్ ఫీల్ తప్పనిసరిగా చూపించాల్సి వచ్చిందట.

నో లిప్ లాక్ సీన్స్..అని ముందే చెప్పేస్తా..

నో లిప్ లాక్ సీన్స్..అని ముందే చెప్పేస్తా..

ఒక విధంగా అందరూ కూడా అది నిజమైన లిప్-లాక్స్ అనుకున్నారు. కానీ నిజానికి సాయి పల్లవి నాగచైతన్యకు లిప్ లాక్ ఇవ్వలేదట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నేను ఇప్పటివరకు కూడా అలాంటి ముద్దు సన్నివేశాల్లో నటించలేదని సినిమా చేసేందుకు ఒప్పుకునే ముందే అలాంటి సన్నివేశాల్లో నటించనని చెప్పేస్తాను. శేఖర్ కమ్ముల గారు కూడా ఆ విషయంలో ఇబ్బంది పెట్టలేదు.

అలా సీన్ సెట్ చేశారు.

అలా సీన్ సెట్ చేశారు.

ఆ సన్నివేశంలో నేను నిజంగా లిప్ లాక్ సీన్ చేయలేదు. కెమెరామెన్ తన కెమెరా యాంగిల్ ను అలా చూపించాడు అంతే. అది డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారి ఐడియానే. అంటూ సాయి పల్లవి చాలా క్లియర్ గా వివరణ చ్చింది. అంతే కాకుండా కేవలం ముద్దు సన్నివేశాల్లో నటిస్తే ఆ పాత్ర హైలెట్ అవుతుందని నేను అనుకోను అంటూ పాత్ర స్వభావం బాగుంటే అందరికీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను అని సాయి పల్లవి తెలియజేసింది.

Recommended Video

Aishwarya Rajesh And Deva Katta Speaks About Republic Movie
భారీగా తగ్గిన కలెక్షన్స్..

భారీగా తగ్గిన కలెక్షన్స్..

ఇక లవ్ స్టొరీ పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదని కొన్ని అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి. అంచనాలకు తగ్గట్లుగా లేదు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. శేఖర్ కమ్ముల తన స్టైల్ కంటే కాస్త డిఫరెంట్ గా ఎక్కువగా కమర్షియల్ పాయింట్స్ తో షాక్ ఇచ్చాడు అని కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక కలెక్షన్స్ అయితే సోమవారానికి భారీగా తగ్గిపోయాయి. ఒకవైపు వర్షాల ప్రభావం కూడా ఈ సినిమాపై గట్టిగానే చూపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X