పరీక్ష రాసిన సాయిపల్లవి.. హాల్ టికెట్ చేతపట్టుకొని ఎగ్జామ్ సెంటర్‌కు.. వీడియో వైరల్
దక్షిణాదిలో ఇటీవల కాలంలో అత్యంత ప్రతిభను చాటుతున్న యువ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. ఎన్ని సినిమాలు చేశామనే లెక్క కాకుండా ఎన్ని మంచి చిత్రాల్లో నటించామనే లక్ష్యంతో విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. అయితే నటనతోపాటు మెడిసిన్ విద్యార్థిగా సాయి పల్లవి రెండు పడవల మీద ప్రయాణం చేయడం తెలిసిందే. తాను అభ్యసిస్తున్న వైద్య విద్య కోసం కొన్ని మంచి పాత్రలను వదిలేసుకొన్నారనే వార్తలు మీడియాలో వెలుగు చూడటం తెలిసిందే. అయితే తాజాగా సాయిపల్లవి గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ వార్త ఏమిటంటే..
Recommended Video

డాక్టర్ కావాలన్న కోరికతో
సాయి పల్లవికి డాక్టర్ కావాలన్నది ఓ కల. తన కలను నెర్చుకోవడానికి విదేశాల్లో వైద్య విద్యను అభ్యసించారు. ప్రేమమ్ చిత్రం తర్వాత ఆమె విదేశాల్లో ఉండగా.. దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి బడా డైరెక్టర్లు, హీరోలు ఆమెకు బంపర్ ఆఫర్లు ఇచ్చారు. అయినా తన డ్రీమ్ చదువే అని, తన చదువుకు ఆటంకం కలగకుండా సినిమాలు చేస్తాననే విషయాన్ని పలు సందర్భాల్లో ఆమె స్పష్టం చేశారు.

సినిమాలు ఓ వైపు.. మరోవైపు వైద్య విద్య
ఓ వైపు సినిమాలు చేస్తూనే మెడిసిన్‌ను పూర్తి చేసే విషయంపై దృష్టిపెట్టారు. ఆ క్రమంలో బ్లాంక్ చెక్ ఇచ్చి తమ సినిమాల్లో ఆఫర్ ఇస్తే కూడా సాయిపల్లవి డబ్బుకు కాకుండా చదువుకే ప్రాధాన్యతను ఇచ్చారు. అలా ఆమె తన చదువును ఇటీవల పూర్తి చేశారు. అయితే విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసే విద్యార్థులు భారత్‌లో మెడికల్ బోర్డు నిర్వహించే పరీక్షను తప్పకుండా పాస్ కావాల్సి ఉంటుంది.

విదేశాల్లో మెడిసిన్ పూర్తి చేసిన సాయిపల్లవి
విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసిన సాయి పల్లవి ఇటీవల నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ నిర్వహించే ఫారీన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (ఎఫ్ఎమ్‌జీఈ) పరీక్షకు హాజరయ్యారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో డాక్టర్‌గా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈ పరీక్షలో తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుచిలోని ఎంఏఎం కాలేజీలో జరిగిన పరీక్షకు హాజరయ్యారు.
దేశంలో అర్హత పరీక్షకు హాజరైన సాయి పల్లవి
విదేశాల్లో వైద్య వృత్తి పూర్తి చేసినందున భారతీయ వైద్య ప్రమాణాలకు అనుగుణంగా అర్హత సాధించే ఎఫ్ఎమ్‌జీఈ పరీక్షకు సాయి పల్లవి ఇటీవల హాజరయ్యారు. ఆమె పరీక్షా కేంద్రంలో హాల్ టికెట్ పట్టుకొని వెళ్లిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. పరీక్ష గదిలోకి వెళ్తున్నట్టు సాయి పల్లవి కనిపించిన వీడియోలో ముఖానికి మాస్క్ ధరించి.. పరీక్షా హాల్ ఎక్కడ అంటూ అడగడం వినిపించింది. ఇలా లాక్‌డౌన్‌లో పరీక్షకు హాజరైన ఆమెకు అభిమానులు భారీ సంఖ్యలో విషెస్ అందజేస్తున్నారు.

సాయి పల్లవి కెరీర్..
ఇక సాయి పల్లవి కెరీర్ విషయానికి వస్తే.. అక్కినేని నాగచైతన్యతో కలిసి లవ్ స్టోరి అనే చిత్రంలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. అలాగే వేణు ఊడుగుల దర్శకత్వంలో వస్తున్న విరాట పర్వంలో కీలక పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











