ఇంట్రెస్టింగ్ మూవీస్ తో ఫుల్ బిజీగా మారిన సాయి పల్లవి!
కేరళ కుట్టి సాయి పల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనాలు చాలా ఈజీగా పెరిగిపోతుంటాయి. ఇక ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అటు వైపు సొంత భాష మళయాళంను వదలడం లేదు.. అలాగే ఇటువైపు స్టార్ డమ్ తెచ్చిన తెలుగును కూడా వదలడం లేదు. వీలైనంత వరకు అన్ని ఇండస్ట్రీలను సమానంగా బ్యాలెన్స్ చేస్తోంది.
అయితే ఈ ఏడాది మాత్రం సాయి పల్లవి టాలీవుడ్ సినిమాలతో స్పీషల్ ఎట్రాక్షన్ గా నిలవనుంది. విరాట పర్వం సినిమాలో ఆమె రానాకు జోడిగా కనిపిస్తోంది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఆ ఎమోషనల్ కథలో కూడా సాయి పల్లవి బలమైన పాత్రలో కనిపిస్తోంది. ఇక ఫిదా అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న లవ్ స్టొరీపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

ఇక అన్నిటి కంటే ఎక్కువగా నాని శ్యామ్ సింగరాయ్ కూడా హాట్ టాపిక్ గా మారింది. పిరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా నటిస్తోంది. కానీ సినిమాలో సాయి పల్లవి పాత్రే మెయిన్ అని తెలుస్తోంది. అందులో ఆమె చాలా సీరియస్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అలాగే అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమా రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్. మొత్తంగా ఈ ఏడాది మొత్తం సాయి పల్లవి కొత్త సినిమాలను ఓకే చేయలేనంత బిజీగా మారిపోయింది. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్టవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











