twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంకో బిడ్డకు జన్మనిచ్చే అర్హత లేదు..అలాంటి రోజు రాకూడదు.. సాయి పల్లవి ఎమోషనల్

    |

    రోజురోజుకూ మానవత్వం చచ్చిపోతోన్నట్టు కనిపిస్తోంది. ఓ వైపు కరోనా వైరస్ మానవాళిని పట్టి పీడిస్తూ ఉన్న మనుషులు తమలోని మృగాన్ని మాత్రం తట్టిలేపుతూనే ఉన్నారు. ఆసిఫా లాంటి ఘటన తమిళనాడులో జరగడంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏడేళ్ల చిన్న పిల్లపై దారుణానికి ఒడిగట్టారు కొందరు దుండగులు. వారిని కఠినంగా శిక్షించాలని సమాజం గొంతెత్తి అరుస్తోంది. తాజాగా సాయి పల్లవి ఈ దారుణ ఘటనపై ఎంతో ఆవేదన చెందింది.

     ఏడేళ్ల బాలికపై..

    ఏడేళ్ల బాలికపై..

    తమిళనాడులో పుదుకొట్టాయ్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఏడేళ్ల బాలికపై ముగ్గురు దుండగులు అత్యాచారం చేశారు. ఆపై ఆ బాలిక చంపేశారు. ఈ ఘటనపై తమిళ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్‌తో న్యాయ పోరాటం చేస్తున్నారు.

    క్రూరత్వాన్ని సంతృప్తి..

    క్రూరత్వాన్ని సంతృప్తి..

    ఇలాంటి దారుణ ఘటనపై సాయి పల్లవి స్పందిస్తూ.. మానవ జాతిపై ఉన్న ఆశ వేగంగా చచ్చిపోతోంది. బలహీనులను కాపాడటానికి ఇచ్చిన అధికారాన్ని దుర్వినయోగం చేస్తాము.. ఎవరు బలహీనంగా కనిపిస్తే వారిపై మన అధికారాన్ని చూపిస్తాము.. మనలోని క్రూరత్వాన్ని సంతృప్తి పరచడానికి పిల్లలను చంపుతాము.

     ప్రపంచానికి అర్హత లేదు..

    ప్రపంచానికి అర్హత లేదు..

    ప్రతి రోజు గడిచేకొద్దీ ప్రకృతి మనకొక సందేశాన్ని ఇస్తున్నట్టు కనిపిస్తోంది.. మన జాతిని పూర్తిగా శుభ్రంగా తుడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి దారుణ ఘటనలు చూడానికి అలాంటి దారుణమైన జీవితాన్ని గడుపుతున్నాము.. మనం దేనికీ పని రాకుండా ఉండిపోయాం. ఈ అమానవీయ ప్రపంచానికి మరొక బిడ్డకు జన్మనివ్వడానికి అర్హత లేదు.

    అలాంటి రోజు రాకూడదు..

    అలాంటి రోజు రాకూడదు..


    నేరం వెలుగులోకి వచ్చినప్పుడు లేదా సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయినప్పుడు మాత్రమే న్యాయం జరిగే రోజు రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. గుర్తించబడని మరియు రిపోర్ట్ చేయలేని నేరాల విషయంలో ఏం జరుగుతోంద'ని ప్రశ్నించింది.

    Recommended Video

    Talasani Sai Kiran Yadav Ditributing Groceries to Journalists & Film Workers
    గుర్తు పట్టేందుకు హ్యాష్ ట్యాగ్

    గుర్తు పట్టేందుకు హ్యాష్ ట్యాగ్


    ప్రతీ చోట ఇలాంటి దారుణాలు జరుగుతున్నందున కచ్చితంగా గుర్తు పట్టేందుకు హ్యాష్ ట్యాగ్‌లు పెట్టాల్సి వస్తోందని సెటైర్స్ వేసింది. చివరగా ఈ ఆవేదనం అంతా ఏడేళ్ల బాలికకు జరిగిన ఘటనపై అని చెప్పడానికి #JusticeforJayapriya అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించింది.

    English summary
    Sai pallavi Become Emotional On Justice for Jayapriya. As it has come to a state where there are so many horrific crimes that we need to use a hashtag to recognize One! #JusticeforJayapriya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X