HBD Sai Pallavi: తండేల్ తర్వాత భారీగా పెరిగిన సాయిపల్లవి ఆస్తులు.. లేడీ పవర్‌స్టార్ సంపద ఎన్ని కోట్లంటే?
భారతీయ చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు వచ్చారు, వెళ్లారు .. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఇలాంటి వారిలో లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి కూడా ఒకరు. ఎక్స్‌పోజింగ్, గ్లామర్ షోకు దూరంగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తూ దూసుకెళ్తున్నారు సాయిపల్లవి. ఆమె ఓ సినిమా చేసిందంటే ఖచ్చితంగా అందులో ఏదో ఒక విషయం ఉంటుందని ప్రేక్షకులు అనుకునే స్థాయికి సాయిపల్లవి చేరుకున్నారు. ఈరోజు సాయిపల్లవి పుట్టినరోజు.. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర విషయాలు మీకోసం?
జార్జియాలో మెడిసిన్ చదివిన సాయిపల్లవి
9 మే 1992న తమిళనాడులోని కోటగిరిలో జన్మించారు సాయిపల్లవి. ఆమె పూర్తి పేరు సాయిపల్లవి సెంథామరై కణ్ణన్. స్వతహాగా డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యామని చాలా మంది నటీనటులు చెబుతుంటారు. కానీ డాక్టర్ చదివిన తర్వాత యాక్టర్ అయిన అతికొద్దిమంది నటీనటుల్లో సాయిపల్లవి కూడా ఒకరు. జార్జియాలోని బిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదివారు పల్లవి. డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టపడే సాయిపల్లవి తొలుత విజయ్ టీవీలో ఓ డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత 2009లో ఈటీవీలో ప్రసారమైన పాపులర్ డ్యాన్స్ ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షో పాల్గొన్నారు. అంతకుముందు కస్తూరి మాన్, ధామ్ ధూమ్ అనే సినిమాల్లో చిన్న పాత్రల్లో మెరిశారు.

ప్రేమమ్‌తో హీరోయిన్‌గా ఎంట్రీ
2015లో మలయాళంలో వచ్చిన ప్రేమమ్‌తో సాయిపల్లవి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు స్వయంగా కొరియోగ్రాఫర్‌గానూ ఆమె వ్యవహరించారు. ఫిదా సినిమాలో భానుమతిగా తెలుగువారిని పలకరించిన సాయిపల్లవి నాటి నుంచి కుర్రాళ్లకు ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయారు. ఆ వెంటనే మిడిల్ క్లాస్ అబ్బాయి, పడిపడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, తండేల్ సినిమాలలో నటించారు. గ్లామర్ షోకు, స్కిన్ షోకు దూరంగా ఉండే సాయిపల్లవి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినా ఆ ప్రాజెక్ట్స్ చేయరు.
డ్యాన్సర్ టూ లేడీ పవర్‌స్టార్
సాయిపల్లవి వివాదాలకు దూరం.. తన పనేంటో తాను చూసుకుని వెళ్లిపోతుంది. ఒకప్పుడు డ్యాన్స్ షో మధ్యలోనే ఎలిమినేట్ అయి ఇప్పుడు లేడీ పవర్‌స్టార్‌గా ఎదిగిన సాయిపల్లవి జీవితం ఎందరికో ఆదర్శం. ఐశ్వర్యరాయ్, మాధురి దీక్షిత్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం. నటి, డ్యాన్సర్ కావడం వెనుక తనకు వారిద్దరే ఆదర్శమని సాయిపల్లవి పలు సందర్భాల్లో తెలిపారు కూడా. అందరు హీరోయిన్స్ మాదిరిగా వాణిజ్య ప్రకటనల్లో నటించి కోట్ల రూపాయలు సంపాదించాలని ఆమె అస్సలు అనుకోదు.
కోట్లు ఆఫర్ చేసినా నో
బ్రాండ్ అండార్స్‌మెంట్స్ విషయంలోనూ ఆమె చాలా పక్కాగా ఉంటారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో తాను నటించనని చాలా హుందాగా తెలిపారు సాయిపల్లవి. తండేల్‌తో ఈ ఏడాది ఘన విజయం అందుకున్న సాయిపల్లవి రీసెంట్‌గా బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఏక్‌దీన్‌తో పాటు ఏకంగా రణబీర్ కపూర్ సరసన రామాయణ సినిమాలో సీత క్యారెక్టర్ దక్కించుకుంది. ఈ సినిమాలతో నార్త్ ఆడియన్స్‌ను కూడా ఆమె ఫిదా చేసే అవకాశం లేకపోలేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్లు కావొస్తుండగా భారతదేశంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటీమణుల్లో సాయిపల్లవి కూడా ఒకరు.
సినిమాకు రూ.8 కోట్ల రెమ్యునరేషన్
అమరన్ సినిమాకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న సాయిపల్లవి ఆ సినిమా తర్వాత నుంచి తన పారితోషికాన్ని రూ.8 నుంచి రూ.10 కోట్ల మధ్యలో ఫిక్స్ చేసినట్లు టాక్. రామాయణ కోసం ఆమె భారీ మొత్తం ఛార్జ్ చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సాయిపల్లవి ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని సోషల్ మీడియా టాక్. తన సహజ నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సాయిపల్లవి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అదిరోహించాలని కోరుకుంటోంది ఫిల్మీబీట్.


Click it and Unblock the Notifications











