సాయి పల్లవికి ఏమైంది.. వరుస విజయాలు వచ్చినా లాభం లేదు.. ఇప్పుడు ఏం చేస్తోందంటే?

సౌత్ ఇండస్ట్రీ లో బెస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సాయిపల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఒక డిఫరెంట్ స్టోరీలైన్ ఉంటుంది అని చెప్పవచ్చు. కమర్షియల్ సినిమాలు చేసిన కూడా అందులో తన పాత్ర రెగ్యులర్గా ఉండకూడదు అని ఎంతో కొంత డిఫరెంట్ గా ఉండాలి అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే సాయి పల్లవి కి వరుస విజయాలు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఆమెకు అవకాశాలు రాకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఆమె ఇప్పుడు ఏం చేస్తోంది అనే వివరాల్లోకి వెళితే..

తొందరగానే..

తొందరగానే..

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి చాలా తొందరగా సౌత్ ఇండస్ట్రీ లో స్థిరపడిపోయింది. మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అసలు ఆమె గ్లామర్ పాత్రల్లో పెద్దగా కనిపించకపోయినా కూడా స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది.

 ప్రేక్షుకుల్లో నమ్మకం

ప్రేక్షుకుల్లో నమ్మకం

ఫిదా సినిమా తర్వాత సాయి పల్లవి కి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే ఈ బ్యూటీ మాత్రం కొంచెం కూడా తొందరపడకుండా కేవలం తనకు నచ్చిన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటు వచ్చింది. ప్రేక్షకుల్లో అయితే సాయి పల్లవి మీద ఒక గట్టి నమ్మకం ఏర్పడింది ఆమె ఏదైనా సినిమా ఓకే చేసింది అంటే తప్పకుండా ఆ సినిమాలో ఏదో ఒక కొత్త తరహా కంటెంట్ ఉంటుంది అని ప్రేక్షకులలో బలమైన ముద్ర వేసుకుంది.

రెండు విజయాలు

రెండు విజయాలు

ఇక గత ఏడాది సాయి పల్లవి వరుసగా రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ను పెంచుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేసిన మరో లవ్ స్టోరీ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అందకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత నానితో చేసిన పిరియాడ్ లవ్ స్టోరీ శ్యామ్ సింగరాయ్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అలా రెండు సినిమాలు సక్సెస్ కావడంతో సాయి పల్లవి మళ్లీ దూకుడు పెంచింది అని అనుకున్నారు.

 ఒకే ఒక్క సినిమా

ఒకే ఒక్క సినిమా

అయితే అలా రెండు విజయాలను చూసినప్పటికి కూడా ప్రస్తుతం సాయి పల్లవి ఒక్క సినిమా షూటింగులో కూడా పాల్గొనే అవకాశం లభించడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా విరాట పర్వం. ఈ సినిమా గత ఏడాది నుంచి విడుదల చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఖాళీగానే..

ఖాళీగానే..

ప్రస్తుతం సాయి పల్లవి ఐతే ఖాళీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఆ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి బోలా శంకర్ సినిమాలో మెగాస్టార్ సోదరుగా కనిపించే అవకాశం వచ్చింది కానీ సాయి పల్లవి ఆ ఆఫర్ను రిజెక్ట్ చేసింది. ఇక ప్రస్తుతం సాయి పల్లవి ఓ తమిళ ప్రాజెక్టుపై చర్చల్లో ఉన్నట్లు సమాచారం. సాయి పల్లవి ఫైనల్ గా సినిమా కథ తనకు నచ్చితేనే సిగ్నల్ ఇవ్వడానికి సిద్ధం అవుతోందట. లేదంటే సైలెంట్ గా ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X