Sai Pallavi: సాయి పల్లవి అరుదైన రికార్డు.. ఈ ఫీట్ అందుకున్న ఫస్ట్ హీరోయిన్
స్టార్ హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా ఉండే ఆమె తాను పోషించే ప్రతీ పాత్రకు పరిపూర్ణంగా న్యాయం చేస్తుంది. సాయిపల్లవి ఓ సినిమాకు ఒప్పుకుందంటే..మంచి కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.అలా సహజ నటనకు చిరునామాగా నిలిచిన సాయి పల్లవి మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. తక్కువ సినిమాలే చేసినా... ఎక్కువ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుని, స్టార్ హీరోయిన్లకే గట్టి పోటీ ఇస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
మలయాళ సినిమా ప్రేమమ్ (Premam)తో తెరంగేట్రం చేసిన సాయి పల్లవి, తొలి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు అందుకోవడం విశేషం. ఆ తర్వాత తెలుగులో ఫిదా లో భానుమతిగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది. గ్లామర్ పాత్రలకు దూరంగా... కథ, పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంచుకుంటూ తనదైన మార్గంలో సాగుతోంది. అదే ఆమెను 'నటనకు బ్రాండ్'గా మార్చిందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

సాయి పల్లవి గ్లామర్ షో, కమర్షియల్ హంగులకన్నా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకోవడం వల్లే ఆమెకు ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రేమమ్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు గెలుచుకున్న సాయి పల్లవి, ఆ తర్వాత ఫిదా లో భానుమతిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. అక్కడితో ఆగకుండా శ్యామ్ సింగ రాయ్, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో భావోద్వేగాలకు ప్రాణం పోసిన పాత్రలు చేసి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు అందుకుంది.
ఇక గార్గి లో ఆమె చేసిన పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలతో పాటు మరో ఫిల్మ్‌ఫేర్‌ను తెచ్చిపెట్టగా, విరాటపర్వం కు క్రిటిక్స్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వరించింది. తాజాగా అమరన్ తో మరోసారి బెస్ట్ యాక్ట్రెస్‌గా నిలిచి మొత్తంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు తన ఖాతాలో వేసుకుంది. ఇలా తక్కువ సినిమాలే చేసినా... ప్రతి పాత్రలో జీవిస్తూ ప్రేక్షకులను మెప్పించడం, కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకోవడం సాయి పల్లవి ప్రత్యేకత. అందుకే స్టార్ హీరోయిన్లకు కూడా సాధ్యం కాని రికార్డ్‌ను ఆమె సాధించగలిగింది. నిజంగా చెప్పాలంటే.. కంటెంట్ బేస్డ్ సినిమాలతోనే ఫిల్మ్‌ఫేర్ రాణిగా మారిన అరుదైన హీరోయిన్ సాయి పల్లవి.
దాదాపు పదేళ్ల కెరీర్‌లో సాయి పల్లవి నటించిన సినిమాలు 20కి కూడా చేరలేదు. అయినా ఏకంగా 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అంటే అది మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నా... స్టార్ హీరోయిన్ ట్యాగ్ కన్నా నటిగా గుర్తింపు పొందడానికే ఆమె ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. డ్యాన్సర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ, తొలి సినిమాతోనే సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విభిన్నమైన పాత్రలు చేస్తూ తన నటనా పరిధిని విస్తరించింది. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతూ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. రామాయణ్ మూవీలో రణబీర్ కపూర్ కి జోడిగా సీత పాత్రలో ఈమె నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


Click it and Unblock the Notifications











