ఎంతో మంది వద్దన్నారు.. అయినా దర్శకుడి మాటలు నమ్మేస్తున్న సాయి పల్లవి!

సౌత్ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నా సాయి పల్లవికి ఉండే క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పాలి. ఫెయిల్యూర్స్ ఎన్ని వచ్చినా కూడా ఫిదా బ్యూటీకి ఎలాంటి డోకా లేదు. ఎందుకంటే ఒక పాత్ర ప్రయోగాత్మకంగా ఉందంటే చాలు దర్శకులు మరో ఆలోచన లేకుండా సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎలాంటి ఆఫర్ అయినా సరే సాయి పల్లవి రిజెక్ట్ చేయాల్సిందే గాని ఆమె డేట్స్ ఇస్తే వద్దనే వారు ఉండరు.

రీసెంట్ గా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎందుకంటే ఒక దర్శకుడి నమ్మి సాయి పల్లవి మోసపోతోందట. స్క్రిప్ట్ విషయంలో ఎప్పుడు కొత్తగా ఆలోచించే ఈ కేరళ కుట్టి ఇప్పుడెందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. అసలు మ్యాటర్ లోకి వెళితే.. RX100 దర్శకుడు అజయ్ భూపతి నెక్స్ట్ మహా సముద్రం అనే ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కోసం దర్శకుడు చాలా మంది హీరో హీరోయిన్స్ ని కలిశాడు.

Sai pallavi doubtful green signal to Rx 100 director ajay bhupathi

మొదట్లో అందరూ ఇంట్రెస్ట్ చూపినవారే అయినప్పటికీ ఆ తరువాత ఒక్కొక్కరు ఒక్కో విధంగా సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే తప్పుకున్నారు. ఇక ఫైనల్ గా హీరోగా శర్వానంద్ సెలెక్ట్ అవ్వగా హీరోయిన్ కోసం సాయి పల్లవిని సంప్రదించినట్లు తెలుస్తోంది. సమంత, తమన్నా, లావణ్య త్రిపాఠి వంటి వారు ఆ క్యారెక్టర్ అంతగా బాలేదని కెరీర్ పై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉందని చేయమని చెప్పేశారట. కానీ సాయి పల్లవి మాత్రం నో చెప్పకుండా దర్శకుడి మాటలు నమ్మేసి గుడ్డిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X