కెరీర్‌లోనే కష్టమైన సీన్ అదే.. చాలా ఇబ్బంది పడిపోయా.. బయటపెట్టిన సాయి పల్లవి
భానుమతి.. హైబ్రిడ్ పిల్లా.. ఒక్కటే పీస్ ఈ డైలాగ్స్ వింటే చాలు సాయి పల్లవి మదిలో మెదులుతుంది. అలాంటి సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఫిదా సినిమా అందర్నీ కట్టిపడేసిన సాయి పల్లవి.. తన నటన, ప్రజెన్స్‌తో సినిమాను ఓ లెవెల్‌కు తీసుకువెళ్తుంది. అలాంటి సాయి పల్లవి ఓ సీన్ కోసం చాలా కష్టపడిందట. ఆ విశేషాలను తాజాగా బయట పెట్టింది ఈ అమ్మడు. అవేంటో ఓ సారి చూద్దాం.

హీరోలకు ధీటుగా..
సినిమాలో హీరోలకు ధీటుగా స్క్రీన్ ప్రజెన్స్ ఇచ్చే సాయి పల్లవికి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సాయి పల్లవి ఓ సినిమాకు ఓకే చెప్పిందంటే చాలు.. తన క్యారెక్టర్ అదిరిపోతుందన్నట్టే. అందుకే ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా మంచి పేరును మాత్రం తీసుకొస్తాయి.

యాడ్స్‌కు దూరం..
మామూలుగా అయితే హీరోయిన్స్ తమకు వచ్చిన నేమ్, ఫేమ్, క్రేజ్‌ను వాడుకుంటారు. ఇష్టమొచ్చిన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంటారు. కానీ సాయి పల్లవి మాత్రం తాను నమ్మిన సిద్దాంతానికే కట్టుబడి ఉంది. ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా యాడ్స్‌లో మాత్రం నటించడం లేదు.

ఆ సీన్ కోసం చాలానే..
అలాంటి సాయి పల్లవి ఓ సీన్ చేయడానికి చాలా కష్టపడిందంటా. ఫిదా సినిమాలో పాటలో భాగంగా ట్రాక్టర్ నడిపే సీన్ తన కెరీర్‌లోనే అతి కష్టమైన సీన్ అని చెప్పుకొచ్చింది. ఆ సీన్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడని తెలిపింది.
Recommended Video

ప్రస్తుతం బిజీబిజీగా..
సాయి పల్లవి ప్రస్తుతం బిజీబిజీగా గడిపేస్తుంది. నాగ చైతన్య సరసన లవ్ స్టోరీ సినిమాలో నటిస్తోంది. మరోసారి శేఖర్ కమ్ముల ఫిదా చేసేందుకు వీరిద్దరిని ప్రయోగిస్తున్నాడు. మరోవైపు రానాతో విరాటపర్వం సినిమా చేస్తోంది.


Click it and Unblock the Notifications











