Just In
Don't Miss!
- News
శశికళకు కరోనా పాజిటివ్ -24 గంటల్లో ట్విస్టులు -ఐసీయూలో చేరిక -జయలలిత చికిత్సలా?
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్: లక్కీ ఛాన్స్ కొట్టేసిన రౌడీ బేబీ
సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో బంపర్ హిట్ అయిన 'పింక్'కు రీమేక్‌గా రూపొందుతోందీ మూవీ. ఇది పట్టాలపై ఉండగానే మరికొన్ని చిత్రాలను లైన్‌లో పెట్టేశాడీ స్టార్ హీరో. వీటిలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించే చిత్రంతో పాటు హరీశ్ శంకర్ ప్రాజెక్టు కూడా ఉంది. వీటితో పాటు మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ కూడా చేస్తున్నారు.
'వకీల్ సాబ్' తర్వాత పవన్ కల్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకోసం స్క్రీన్ టెస్ట్ కూడా పూర్తయింది. అయితే, ఇప్పుడు అనూహ్యంగా 'అయ్యప్పనుమ్ కోషియం' రీమేక్ తెరపైకి వచ్చింది. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్నాడు. మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ఈ మూవీలో మరో హీరో పాత్ర కోసం రానా, గోపీచంద్ సహా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ మూవీలో నటించే హీరోయిన్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఎప్పటి నుంచో ప్రచారం అవుతోన్నట్లే ఇందులో సాయి పల్లవి నటిస్తుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమానే కాదు.. పవన్ కల్యాణ్ - క్రిష్ జాగర్లమూడి కాంబోలో రాబోతున్న సినిమాలోనూ సాయి పల్లవి నటిస్తుందని అంటున్నారు. హీరోయిన్లంతా పవర్ స్టార్ సినిమాలో ఒక్క చాన్స్ అయినా రావాలని చూస్తున్న వేళ.. రౌడీ బేబీ ఏకంగా రెండు సినిమాలు చేస్తుందన్న న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది.