Thandel: మళ్ళీ క్రెడిట్ కొట్టేసిన సాయి పల్లవి.. పాపం నాగచైతన్య!

ప్రతీ సినీ పరిశ్రమలో అయినా కూడా ఎందరో హీరోయిన్స్ కనిపిస్తూ ఉంటారు కానీ కేవలం కొందరికి మాత్రమే ఒక రకమైన ప్రత్యేకత కనిపిస్తుంది. అలా మన సౌత్ సినిమా దగ్గర ఉన్న ఎంతోమంది బ్యూటీస్ లో చాలా రేర్ గా అనిపించే హీరోయినే సాయి పల్లవి. కాగా సాయి పల్లవి ఇతర హీరోయిన్స్ లా కాకుండా తనకంటూ కొన్ని సెపరేట్ హద్దులు పెట్టుకొని వాటిలోనే పాన్ ఇండియా రేంజ్ హీరోయిన్ గా మారిపోయింది.

ఎలాంటి పెదవి ముద్దులు స్కిన్ షో లాంటివి లేకుండానే భారీ సినిమాల్లో భాగం అయ్యింది. కాగా ఈమె నటించిన దాదాపు అన్ని సినిమాల్లో చూసినట్టు అయితే పలు హిట్ సినిమాలు అలాగే ప్లాప్ సినిమాలకి కూడా మేజర్ గా ఆడియెన్స్ సహా క్రిటిక్స్ కూడా ఎందుకో తనకే ఎక్కువ మార్కులు ఇస్తూ ఉంటారు.

sai pallavi hit streak continues but thandel credit goes to who

తన సరసన చాలా మంది స్టార్స్ నటించినప్పటికీ సాయి పల్లవి సినిమా పూర్తయ్యాక తన కోసమే ఎక్కువ మాట్లాడుకునేలా చేయడం తన స్పెషాలిటీ అని చెప్పవచ్చు. కాగా ఇలా సాయి పల్లవి సినిమాలు అంటే దాదాపు ఆమె వల్లనే రన్ అవుతాయి ఇక హీరోల పాత్ర ఏ మాత్రం లేదు అనే రేంజ్ లో పలు కామెంట్స్ వస్తూ ఉంటాయి. దీనితో తనకే ఎక్కువ క్రెడిట్ కూడా వెళ్ళిపోతుంది.

తన మోలీవుడ్ డెబ్యూ ప్రేమమ్, అలాగే టాలీవుడ్ డెబ్యూ సినిమా ఫిదా సినిమాల్లో కూడా సాయి పల్లవి హైలైట్ అయ్యింది. అలాగే ఆ తర్వాత చేసిన పలు సినిమాలకి కూడా ఆమె పేరే ఎక్కువగా వినిపించగా వారిలో అక్కినేని యువ హీరో నాగ చైతన్య కూడా ఉన్నాడు. మరి నాగ చైతన్యతో సాయి పల్లవి చేసిన మొదటి సినిమా "లవ్ స్టోరీ".

ఈ సినిమా అప్పట్లో నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సహా రికార్డు వసూళ్లు కూడా అందుకుంది. మరి ఈ సినిమాలు మాత్రమే కాకుండా గత ఏడాది వచ్చిన తమిళ సెన్సేషనల్ హిట్ చిత్రం "అమరన్" వరకు కూడా సాయి పల్లవి వైపే క్రెడిట్ వెళ్ళిపోయింది. దీనితో ఆ సదరు హీరోల ఫాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. కానీ ఇపుడు మాత్రం సాయి పల్లవికి ఇలా క్రెడిట్ తీసుకునే ఛాన్స్ లేదు అన్నట్టుగా టాక్ నడుస్తుంది.

సాయి పల్లవి మళ్ళీ అదే నాగ చైతన్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా తండేల్ కి సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ అనూహ్యంగా ఇక్కడ సాయి పల్లవి కంటే నాగ చైతన్య సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లపై ప్రశంసలు వస్తున్నాయి. కాగా సాయి పల్లవిపై కూడా పలు ప్రశంసలు వస్తున్నాయి కానీ ఆ ముందు సినిమాల తరహాలో ఆమె పైనే ఎక్కువ కామెంట్స్ ఇపుడు వినిపించడం లేదు.

దీనితో ఈసారి మాత్రం సాయి పల్లవి ఫ్యాన్స్ పప్పులు ఉడకలేదనే చెప్పి తీరాలి. అలాగే ఈ సినిమాకి హైప్ కూడా మొదటి నుంచి నాగ చైతన్య సైడ్ నుంచే కనిపించడం మరో ఇంట్రెస్టింగ్ అంశం కాగా ఫైనల్ గా సాయి పల్లవి హిట్ స్ట్రీక్ లో మాత్రం తన బ్రాండ్ పక్కకు వెళ్లాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X