జీవితంలో ఎవర్నిపెళ్లిచేసుకొను.. కారణం అదే.. నా లైఫ్ అంకితం.. సాయిపల్లవి
విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ విలక్షణ నటిగా పేరు తెచ్చుకొన్న సాయిపల్లవి వరుస విజయాలు, సక్సెస్‌లతో దూసుకెళ్తున్నారు. దక్షిణాదిలో ఆమె నటించిన చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. ఎనర్జిటిక్ డ్యాన్సులు, నటనతో ఆమె నిర్మాతలను క్యూ కట్టించుకొనే స్థాయికి వెళ్లారు. ఇటీవల ధనుష్‌తో కలిసి నటించిన మారి2 చిత్రం సాయిపల్లవికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా సాయిపల్లవి సినిమా గురించి, వ్యక్తిగత జీవితం గురించి స్పష్టంగా వెల్లడించిది.

రౌడీ బేబీ సాంగ్‌తో
మారి2 సినిమాలో ధనుష్‌తో కలిసి చేసిన డ్యాన్సులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. రౌడీ బేబీ సాంగ్ య్యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షకులు చూసిన పాటగా నిలిచింది. ప్రభుదేవా సమకూర్చిన నృత్యానికి సాయిపల్లవి రెచ్చిపోయి డ్యాన్స్ చేసింది. దాదాపు 200 మిలియన్ల వ్యూస్ సాధించడం గమనార్హం. దీంతో తమిళనాడులో సాయిపల్లవికి మరింత క్రేజ్ పెరిగింది.

పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు
తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి మాట్లాడుతూ పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం షాక్ గురిచేసింది. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకొన్నాను. ఎల్లకాలం నా తల్లిదండ్రుల వద్దే ఉండాలని అనుకొంటున్నాను. వారి బాగోగులు చూసుకొంటూ గడపాలని నిర్ణయం తీసుకొన్నాను అని సాయిపల్లవి వెల్లడించింది.

అందుకే పెళ్లికి దూరంగా ఉండాలని
నేను పెళ్లి చేసుకోంటే నా తల్లిదండ్రుల సంరక్షణను పూర్తిగా నిర్వర్తించలేనేమో అనే ఆందోళన ఉంది. అందుకే పెళ్లికి దూరంగా ఉండాలని అనుకొంటున్నాను. నా తల్లిదండ్రులంటే చెప్పలేనంత ప్రేమ. మా ప్రేమలో, చిన్న ఫ్యామిలీలో మరొకరు దూరడం నాకు ఇష్టం లేదు అని సాయిపల్లవి స్పష్టం చేసింది

వేణు ఊడుగుల చిత్రంలో
మారి2 మూవీ తర్వాత సాయిపల్లవి తదుపరి చిత్రంలో సూర్యతో కలిసి ఎన్‌జీకే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఫిబ్రవరి 14న రిలీజ్ కానున్నది. అలాగే నీది నాది ఒకే కథ ఫేం వేణు ఊడుగుల రూపొందించే చిత్రంలో నటించనున్నది. 80వ దశకం నాటి నేపథ్యంతో రూపొందే ఈ చిత్రంలో రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











