బాలీవుడ్ ఆఫర్స్ పై క్లారిటీ ఇచ్చేసిన సాయి పల్లవి.. అలా అయితేనే చేస్తానంటూ..
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో సాయిపల్లవి అగ్రస్థానంలో ఉంది అని చెప్పవచ్చు ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఫిదా సినిమా నుంచి సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే ఆమె టాలెంట్ ఏమిటో చాలా ఈజీ గా అర్థమైంది. ఇక ఆ తర్వాత టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రయోగాత్మకమైన పాత్రలకు సాయిపల్లవి పెట్టింది పేరుగా అవకాశాలను అందుకుంటుంది. ఇటీవల ఈ శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ఆమె చేసిన పాత్రకు చాలా మంచి గుర్తింపు లభించింది. ఇక సినీ ప్రముఖులు చాలామంది కూడా సాయి పల్లవి తనలోని సరికొత్త నటనను బయటపెట్టింది అని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదివరకే లవ్ స్టోరీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న సాయిపల్లవి ఇప్పుడు అంతకు మించిన అనేలా అడుగులు వేయాలని చూస్తోంది. ఇక ఈ బ్యూటీ టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా గతంలో ఆఫర్స్ అందుకున్నట్లు కథనాలు వేకువడ్డాయి. అయితే ఇప్పటి వరకు కూడా సాయి పల్లవికి బాలీవుడ్ నుంచి పెద్దగా ఆఫర్స్ రాలేవని క్లారిటీ ఇచ్చేసింది. కానీ అటు వైపు కూడా ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నట్లు ఒక క్లారిటీ అయితే ఇచ్చింది.

ఇటీవల శ్యామ్ సింగరాయ్ ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన సాయిపల్లవి బాలీవుడ్ సినిమాలు చేయడానికి తనకు ఏ మాత్రం అభ్యంతరం లేదని కూడా చెప్పేసింది. కానీ ఎలాంటి సినిమా చేసినా కూడా స్క్రిప్ట్ చాలా బలంగా ఉండాలి అని అంతేకాకుండా తన పాత్ర కూడా కథలో చాలా కీలకంగా ఉండాలి అని సాయిపల్లవి చెప్పింది. స్టోరీ ఏదైనా సరే తప్పకుండా భాషతో సంబంధం లేకుండా చేయడానికి సిద్ధంగా ఉంటానని చెప్పేసింది. తనకు నచ్చిన ఆఫర్స్ వస్తే తప్పకుండా బాలీవుడ్ లో చేస్తానని ఈ బ్యూటీ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చేసినా కూడా అప్పుడప్పుడు కొన్ని రొమాంటిక్ సీన్స్ గట్టిగానే చేయాల్సి ఉంటుంది. కానీ సాయి పల్లవి ఇప్పటివరకు రొమాంటిక్ డోస్ పెంచే విధంగా ఎలాంటి సినిమాలు చేసింది లేదు. కేవలం పరిధిలోనే వీలైనంత వరకు డోస్ తక్కువగా ఉండే సినిమాలు చేసేందుకు ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఆమె వేసుకునే డ్రస్ ల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు వహిస్తుంది. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సార్లు అలా కమిట్ అవ్వక తప్పదు.
మరి ఆ వాతావరణంలో సినిమా అవకాశం దక్కించుకుంటే సాయిపల్లవి ఎలా కొనసాగుతుందో చూడాలి. ఇక సాయిపల్లవి చేతిలో ప్రస్తుతం మరిన్ని మంచి సినిమాలు ఉన్నాయి. కేవలం మలయాళం లోనే కాకుండా టాలీవుడ్ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఆమెకు స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కుతుంది. ఇక రానా దగ్గుబాటి తో నటించిన విరాటపర్వం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి అనంతరం ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











