సాయి పల్లవికి బోల్డ్ సినిమాలో ఆఫర్.. లిప్ లాక్స్ చేస్తే పరిస్థితి ఏంటి?

ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని పాత్ బ్రేకింగ్ మూవీస్ ఉంటాయి అలా మన తెలుగు సినిమాలో కూడా ఎప్పటికప్పుడు సినిమాలు ఒక్కొక్క టైంలో మంచి పాత్ బ్రేకింగ్ సినిమాలుగా వచ్చాయి. అలా మన తెలుగులో ఇటీవల కాలంలో వచ్చిన పలు చిత్రాల్లో ఒక సినిమా సెట్ చేసిన సెన్సేషన్ అంత కాదు. కాగా ఆ సినిమానే "అర్జున్ రెడ్డి".

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, యంగ్ హీరో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ఈ బోల్డ్ ప్రేమ కథ చిత్రం తెలుగు సినిమా దగ్గర ఒక ఊహించని హిట్ గా మారింది. అప్పటివరకు వచ్చిన ప్రేమ కథ చిత్రాలు ఒక ఎత్తు అయితే ఇంకొకటి చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన యంగ్ హీరోయిన్ శాలిని పాండే నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

Sai pallavi is first choice for bold movie arjun reddy

కాగా శాలిని పాండే ఈ మొదటి సినిమాతోనే ఒక క్రేజీ బోర్డ్ సీన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. తనతో పాటుగా విజయ్ దేవరకొండ కూడా సినిమాకి కావలసిన బోల్డ్ సీన్స్ లో నటించి ఇద్దరు అప్పట్లో సంచలనం గా నిలిచారు. అయితే ఈ సినిమాలు శాలిని పాండే చేసిన పాత్రకి మొదటి ఛాయిస్ కాదు ఇటీవల సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చెప్పడం ఒకింత ఆశ్చర్యానికి అందర్నీ లోను చేసింది.

ఈ రోల్ ని శాలిని కాకుండా మొదట నాచురల్ బ్యూటీ సాయి పల్లవి తో చేద్దామని అనుకున్నట్టుగా సమీపంగా రివీల్ చేశాడు. దీంతో అందరిలో ఒక్కసారిగా అలాంటి బోల్డ్ బోల్డ్ పాత్రలో సాయి పల్లవి చాలామంది ఊహించుకోలేకపోయారు. సాయి పల్లకి ఇప్పటివరకు ప్రతి సినిమాలో కూడా చాలా సెటిల్డ్ గానే కనిపించిన సంగతి తెలిసిందే.

Sai pallavi is first choice for bold movie arjun reddy

అక్కడక్కడ కొన్ని ముద్దు సీన్లు అది కూడా పెదవి ముద్దులు కాకుండా నార్మల్ సీన్స్ లోనే నటించింది. అర్జున్ రెడ్డిలో ఏ లెవెల్లో సీన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. మరి అలాంటి సినిమాలో సాయి పల్లవి అంటే తన ఫ్యాన్స్ కూడా దీనిని జీర్ణించుకోలేకపోవచ్చు. కాగా సందీప్ కూడా ఇదే మాటని సాయి పల్లవి ఇన్ని సినిమాల విషయంలో కూడా చెప్పి తను తప్పుగా ఊహించాను కానీ అందుకు అతీతం అని సాయి పల్లవి ప్రూవ్ చేసినట్లు సందీప్ తెలిపాడు.

మరి ఇన్ని సినిమాల్లో సాయి పల్లవిని నార్మల్ గా చూసి అలాంటి సినిమాల్లో అంటే ఒకింత ఆలోచించాలి. ఒక రకంగా ఆమె అలాంటి సినిమా చెయ్యకుండా ఉండడమే మంచిది ఏమో అనుకోవచ్చు. లేదంటే తనపై కూడా సోషల్ మీడియాలో మరో రకమైన ముద్ర పడి ఉండొచ్చు.

ఇక అలాంటి కల్ట్ సినిమాలో నటించిన శాలిని పాండే పెద్దగా అవకాశాలు లేక స్ట్రగుల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా సాయి పల్లవి నటించిన అవైటెడ్ సినిమా తండేల్ తో ఈ శుక్రవారం థియేటర్స్ లో సందడి చేసేందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో నాగ చైతన్య అక్కినేని నటించగా తనతో రెండోసారి హీరోయిన్ గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X