Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఇది ఆనందం కాకపోతే మరి ఇంకేంటి?.. వర్షంలో సాయి పల్లవి షికార్లు
ఒక్కో సమయంలో ఒక్కో హీరోయిన్ ఫేమస్ అవుతుంది. ఒకేసారి ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేసేసి.. బాగా సంపాదించేవి సైడ్ అవుతుంటారు. అయితే కొందరు మాత్రం ఎప్పటికీ అలా నిలిచిపోతారు. వారు చేసే సినిమాల సంఖ్ తక్కువే అయినా.. క్రేజ్ మాత్రం ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటి కేటగిరిలోకి సాయి పల్లవి వస్తుంది. చేసిన సినిమాలెన్ని అని చూసుకోదు.. ప్రేక్షకులను మెప్పించాయా? లేదా? అన్నదే లెక్కలోకి తీసుకుంటుంది.
అందుకే ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. సాయి పల్లవి ఓ సినిమాకు ఓకే చెప్పిందంటే అందులో ఏదో ఒక విశేషం ఉండాల్సిందే. ఎలాంటి పాత్రనైనా సరే సాయి పల్లవి తనదైన శైలిలో నటించేస్తుంది. సాయి పల్లవికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎంత ఇవ్వడానికికైనా నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఇక ప్రకటనల సంగతి అయితే సరేసరి. కానీ సాయి పల్లవి మాత్రం ఏనాడు కూడా తన క్రేజ్‌ను డబ్బుల కోసం ఉపయోగించుకోలేదు.
సాయి పల్లవి ప్రస్తుతం లాక్ డౌన్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీతో కలిసి షికారుకు బయలుదేరింది. ఈ మేరకు అమ్మ గురించి చెబుతూ.. నాకు దొరికే ప్రతి అవకాశాన్ని, నా ప్రేమతో ఆమెను ఆనందంగా ఉంచేలా చేస్తానని తెలిపింది. అంతేకాకుండా ఓ వీడియోను షేర్ చేస్తూ కారులో వేగంగా వెళ్తున్న వీడియోను షేర్ చేసింది. చుట్టూ కొండ ప్రాంతాలు, అటవి ప్రదేశంలో లాంగ్ డ్రైవ్ చేస్తూ.. ఇది ఆనందం కాకపోతే ఇంకేంటి మరి? అని ప్రశ్నించింది. సాయి పల్లవి మాత్రం ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం, శేఖర్ కమ్ముల డైరెక్షన్లో లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.