twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇది ఆనందం కాకపోతే మరి ఇంకేంటి?.. వర్షంలో సాయి పల్లవి షికార్లు

    |

    ఒక్కో సమయంలో ఒక్కో హీరోయిన్ ఫేమస్ అవుతుంది. ఒకేసారి ఇబ్బడిముబ్బడిగా సినిమాలు చేసేసి.. బాగా సంపాదించేవి సైడ్ అవుతుంటారు. అయితే కొందరు మాత్రం ఎప్పటికీ అలా నిలిచిపోతారు. వారు చేసే సినిమాల సంఖ్ తక్కువే అయినా.. క్రేజ్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుంది. అలాంటి కేటగిరిలోకి సాయి పల్లవి వస్తుంది. చేసిన సినిమాలెన్ని అని చూసుకోదు.. ప్రేక్షకులను మెప్పించాయా? లేదా? అన్నదే లెక్కలోకి తీసుకుంటుంది.

    అందుకే ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. సాయి పల్లవి ఓ సినిమాకు ఓకే చెప్పిందంటే అందులో ఏదో ఒక విశేషం ఉండాల్సిందే. ఎలాంటి పాత్రనైనా సరే సాయి పల్లవి తనదైన శైలిలో నటించేస్తుంది. సాయి పల్లవికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ఎంత ఇవ్వడానికికైనా నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఇక ప్రకటనల సంగతి అయితే సరేసరి. కానీ సాయి పల్లవి మాత్రం ఏనాడు కూడా తన క్రేజ్‌ను డబ్బుల కోసం ఉపయోగించుకోలేదు.

    Sai Pallavi Long Drive With Family In Rain

    సాయి పల్లవి ప్రస్తుతం లాక్ డౌన్‌ను తెగ ఎంజాయ్ చేస్తోంది. ఫ్యామిలీతో కలిసి షికారుకు బయలుదేరింది. ఈ మేరకు అమ్మ గురించి చెబుతూ.. నాకు దొరికే ప్రతి అవకాశాన్ని, నా ప్రేమతో ఆమెను ఆనందంగా ఉంచేలా చేస్తానని తెలిపింది. అంతేకాకుండా ఓ వీడియోను షేర్ చేస్తూ కారులో వేగంగా వెళ్తున్న వీడియోను షేర్ చేసింది. చుట్టూ కొండ ప్రాంతాలు, అటవి ప్రదేశంలో లాంగ్ డ్రైవ్ చేస్తూ.. ఇది ఆనందం కాకపోతే ఇంకేంటి మరి? అని ప్రశ్నించింది. సాయి పల్లవి మాత్రం ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.

    English summary
    Sai Pallavi Long Drive With Family In Rain. she says that if this isn’t bliss, then what is.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X