'లవ్ స్టొరీ' సారంగదరియా పాటతో మరో రికార్డ్ అందుకున్న సాయి పల్లవి

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి, నాగ చైతన్య జంటగా నటించిన చిత్రం లవ్ స్టొరీ. ఈ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక విదంగా సినిమాకు వస్తున్న బజ్ చూస్తుంటేనే ఆ విషయం చాలా ఈజీగా అర్థమవుతోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల ఫిదా అనంతరం చాలా గ్యాప్ తీసుకొని సాయి పల్లవితో చేసిన సినిమా కాబట్టి అంచనాలు గట్టిగానే ఉన్నాయి.

గత ఏడాది సమ్మర్ లో రావాల్సిన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ వలన వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక థియేటర్స్ ఓపెన్ కావడంతో లవ్ స్టొరీ విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 16న సినిమా విడుదల కాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. అయితే సినిమాలోని సారంగదరియా పాట యూ ట్యూబ్ లో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 24గంటల్లోనే 6 మిలియన్ వ్యూవ్స్ అందుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

Sai pallavi love story movie song new record in youtube

ఇక 24గంటల్లో అత్యధికంగా 300k లైక్స్ కూడా అందుకుంది. రెహమాన్ శిష్యుడు పవన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఫిదా సినిమాలో వచ్చిందే పాట ఎంతగా సక్సెస్ అయ్యిందో అదే తరహాలో వైరల్ అవుతోంది. శేఖర్ మాస్టర్ కొరియాగ్రఫీ చేశారు. ఇందులో కూడా సాయి పల్లవి అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టేసినట్లు అర్ధమవుతోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X