Sai Pallavi: పెళ్లి ఆలోచన లేదు.. అర్ధరాత్రి కూడా వారే నాకు తోడు.. సాయిపల్లవి

టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'ఫిదా’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయం అయిన సాయి పల్లవి. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో కోట్లాది ప్రేక్షకులను సంపాదించుకుంది. అలాగే, చాలా సెలెక్టివ్‌గా పాత్రలు ఎంచుకుంటూ.. వరుస విజయాలతో కెరీర్ పీక్‌లో ఉన్న ఈ భామ. తాజాగా తన పెళ్లిపై చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా హీరోయిన్లు వ్యక్తిగత విషయాలపై సూటిగా స్పందించడానికి ఇష్టపడకపోయినా, సాయి పల్లవి మాత్రం తన స్టైల్లో క్లారిటీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఏమన్నారంటే?

సాయిపల్లవి చిన్నప్పటి నుంచే నటనపై మక్కువ.. అయితే, వెంటనే సినిమాల్లోకి రాకుండా ముందుగా చదువుపై దృష్టి పెట్టింది. డాక్టర్ కోర్సు పూర్తి చేసి తర్వాతే తన కలల దారిలో అడుగులు వేసింది. ఇదే ఆమెను ఇతర హీరోయిన్లతో పోలిస్తే ప్రత్యేకంగా నిలబెట్టింది. డ్యాన్స్‌పై ఉన్న ఆసక్తితో రియాలిటీ షోలలో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్న ఆమె, తర్వాత సినిమాల్లో చిన్న పాత్రలతో ప్రయాణాన్ని ప్రారంభించింది. అలా ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది మలయాళ చిత్రం ప్రేమమ్. ఇందులో తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించింది. ఆ తర్వాత తెలుగులో 'ఫిదా' ద్వారా తెలంగాణ యాసలో మాట్లాడి యువతను ఆకట్టుకుంది. సహజమైన నటన, మేకప్‌కు దూరంగా ఉండటం ఆమె ప్రత్యేకతగా మారాయి.

Sai Pallavi Marriage Actress Gives Shocking Reply About Wedding Plans Says I m Happy Being Single

ఇటీవల కాలంలో సాయి పల్లవి వరుస విజయాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా అమరన్, అలాగే నాగచైతన్యతో నటించిన 'తండేలా' సినిమాలు ఆమెకు మరింత క్రేజ్ తెచ్చాయి. దీంతో ఆమెకు అన్ని భాషల్లో అవకాశాలు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి ఏక్ దిన్ (Ek Din) సినిమాతో హిందీ ప్రేక్షకులకు చేరువవుతోంది. అంతేకాకుండా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణ ( Ramayana) సినిమాలో సీత పాత్ర నటింనున్నది. సాయి పల్లవి కెరీర్ మరో స్థాయికి వెళ్లనుంది. ఇదే సమయంలో తమిళంలో స్టార్ హీరో ధనుష్ సరసన కూడా ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తూ బిజీగా కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో.. ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న సాయి పల్లవికి 'పెళ్లి ఎప్పుడు?' అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్‌గా మారింది. 'ప్రస్తుతం నా పూర్తి ఫోకస్ కెరీర్‌పైనే ఉంది. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పట్లో లేదు. నేను సింగిల్‌గా ఉండడంలోనే సంతోషంగా ఉన్నాను' అని ఆమె స్పష్టంగా చెప్పింది. ఈ వ్యాఖ్యలతో గత కొంతకాలంగా వస్తున్న పెళ్లి రూమర్స్‌కు చెక్ పెట్టింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. 'పెళ్లైన వాళ్లే నన్ను పెళ్లి చేసుకోవద్దని చెబుతున్నారు' అని ఆమె చెప్పడం. ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

అదే ఇంటర్వ్యూలో సాయి పల్లవి చెప్పిన మరో భావోద్వేగ విషయం చెప్పింది. 'నేను అర్థరాత్రి బాధగా ఉంటే, నా అమ్మ తప్ప ఇంకెవరూ నా పక్కన ఉండరు' అని చెప్పడం ఆమె వ్యక్తిగత జీవితం గురించి కొత్త కోణాన్ని బయటపెట్టింది. ప్రస్తుతం 33 ఏళ్ల వయసులో ఉన్న సాయి పల్లవి, తన చెల్లెలు పూజా కన్నన్ పెళ్లిని రెండేళ్ల క్రితమే దగ్గరుండి జరిపించిన విషయం తెలిసిందే. కానీ తన విషయంలో మాత్రం తొందరపడకుండా కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. సాయి పల్లవి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం ఆమె పెళ్లి ఎప్పుడు జరుగుతుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: sai pallavi tollywood ramayan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X