మహేష్ బాబు పాటపై అదరగొట్టిన సాయిపల్లవి.. ఆ స్టెప్పులు చూస్తే మైండ్ బ్లోయింగ్! (వీడియో)

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కేవలం గొప్ప డ్యాన్సరే కాదు.. మంచి పెర్ఫార్మర్ కూడా అనేది అందరికి తెలిసిందే. అయితే తన డ్యాన్సులు, యాక్టింగ్ ప్రతిభతో అనతికాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. అయితే ఆమె హీరోయిన్‌గా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు టెలివిజన్ రంగంలోని రియాలిటీ షోలలో పలు పోటీల్లో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే సాయిపల్లవి అలా డ్యాన్స్ పోటీల్లో పాల్గొన్న వీడియో వైరల్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

సాయిపల్లవి తన కెరీర్‌ను డ్యాన్సర్‌గా మొదలుపెట్టారు. ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్ రియాలిటీ షోలలో పాల్గొని తన ప్రతిభను మ్యూజిక్ రంగానికి చాటింది. ఢీ షోలో చూపిన టాలెంట్ ఆధారంగా ఆమెకు సినిమాల్లో ఛాన్స్‌లు కూడా లభించాయి. మలయాళంలో ఆమె నటించిన ప్రేమమ్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె దశనే తిరిగిపోయింది.

Sai Pallavi Mind Blowing Dance Steps on Mahesh Babu s Athidhi Movie Look at Viral Video

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములతో దిల్ రాజు నిర్మించిన ఫిదా చిత్రంతో సాయిపల్లవి తెలుగులోకి ప్రవేశించింది. ఆ సినిమా తర్వాత మరోసారి కెరీర్ పరంగా వెనక్కి చూసుకోలేదు. ఆ మూవీ అనంతరం నానీతో ఎంసీఏ చిత్రంలో నటించింది. అలాగే పడిపడి లేచే మనసు, లవ్ స్టోరి, శ్యామ్ సింగరాయ్, విరాటపరం సినిమాలతో తెలుగులో స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది.

ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందిన అమరన్ సినిమాతో సాయిపల్లవి మరోసారి సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లక్ బస్టర్‌ను తన ఖాతాలో వేసుకొన్నది. గత 12 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 251 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళంలో 120 కోట్లు, తెలుగులో 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇంకా భారీ వసూళ్లను సాధించేందుకు రెడీ అవుతున్నది.

అయితే అమరన్ సినిమాతో భారీ హిట్ అందుకొన్న సాయిపల్లవి మరో భారీ చిత్రం తండేల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాలో నాగచైతన్యతో రెండోసారి జతకడుతున్నారు. ఈ చిత్రాన్ని బన్నీవాసు, అల్లు అరవింద్ నిర్మించారు. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాను ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు

అయితే ఇలా భారీ విజయాలతో దూసుకెళ్తున్న సాయిపల్లవికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియలో చక్కర్లు కొడుతున్నది. మహేష్ బాబు నటించిన అతిథి సినిమాలోని రాత్రైన నాకు ఓకే అంటూ మలైకా అరోరా స్టెప్పులేసిన పాటపై సాయిపల్లవి డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఆ పాటలో ఆమె వేసిన స్టెప్పులు మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. ఆ వీడియో మీరే చూడండి.

More from Filmibeat

Read more about: sai pallavi mahesh babu athidhi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X