యూ ట్యూబ్ లో హ్యాట్రిక్ రికార్డ్ అందుకున్న సాయి పల్లవి.. అందుకే అంత డిమాండ్!
గ్లామర్ తో ఎంత ఎట్రాక్ట్ చేసినా కూడా నటనలో కొత్తదనం లేకపోతే మాత్రం హీరోయిన్స్ అంత ఈజీగా క్లిక్కవ్వలేరు. విబిన్నంగా పాత్రలను సెలెక్ట్ చేసుకొని ముందుగు సాగితేనే ఆఫర్స్ కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఇక అలాంటి మంచి క్యాటగిరికి చెందిన నటిమణుల్లో సాయి పల్లవి ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ బజ్ క్రియేట్ చేయకుండా ఉండదు.
సరైన పాటలు తగలాలే గాని సాయి పల్లవి ఒంటి చేత్తో మిలియన్ల వ్యూవ్స్ రప్పించగలదు. ఫిదా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళం బ్యూటీ వచ్చిందే పాటతోనే ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. యూ ట్యూబ్ లో ఆ సాంగ్ 300మిలియన్ల వ్యూవ్స్ అందుకుంది. ఇక మారి 2 అంతగా హిట్టవ్వకపోయినా కూడా అందులోని రౌడి బేబి సాంగ్ 1.1బిలియన్స్ వ్యూవ్స్ అందుకుంది.

ఇటీవల వచ్చిన లవ్ స్టోరీలోని సారంగదరియా పాట 200మిలియన్ల వ్యూవ్స్ ను రాబట్టింది. సాయి పల్లవితో మాస్ సాంగ్ చేయిస్తే సినిమాకు ఈజీగా బజ్ క్రియేట్ చేయవచ్చని అందరికి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక ఈ రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది కాబట్టి ఆమె రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేస్తున్నట్లు టాక్. ఇక నెక్స్ట్ సాయి పల్లవి కీలక పాత్రల్లో నటించిన లవ్ స్టొరీ సినిమాతో పాటు, విరాటపర్వం సినిమాలు కూడా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











