Boycott Sai Pallavi: బాయ్‌కాట్ సాయిపల్లవి ట్రెండింగ్.. ఇండియన్ ఆర్మీపై వివాదాస్పద కామెంట్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

Sai Pallavi: సౌత్ ఇండియా ఫీల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి హడావుడి, హంగామా లేకుండా పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ నాచురల్ బ్యూటీ, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి, గ్లామర్ రోల్స్ కాకుండా యాక్టింగ్ కు ప్రాధాన్యత ఇచ్చే నటులలో మొదట వరుసలో ఉండే నటి సాయి పల్లవి. మెయిన్ గా ఎక్స్ పోజింగ్ కు దూరంగా ఉంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. ప్రత్యేక ఫ్యాన్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవి ఓ కాంట్రవర్సీలో చిక్కుకుంది. దీంతో #Boycottsaipallavi హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ అవుతోంది. అసలేం జరిగిందంటే?

సాయి పల్లవి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మలయాళంలో ప్రేమమ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. ఇందులో లెక్చరర్ పాత్రలో సాయిపల్లవి నటన అద్భుతమని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత దుల్కర్ సల్మాన్ తో కలిసి కాళి అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాకు కూడా మంచి పేరు లభించింది. ఈ చిత్రం తెలుగులో 'హే పిల్లగాడా' పేరుతో డబ్ అయింది.

Sai Pallavi old interview video viral in internet calling for a complete boycott on her

ఆ క్రేజ్ తో తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ గమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి. ఇక ఈ సినిమాలో తెలంగాణ పిల్లగా సాయి పల్లవి నటించింది. ఇలా తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. దీంతో ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా మారింది. సాయి పల్లవి అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ లు కొట్టింది.

ప్రస్తుతం మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ మూవీలో సాయి పల్లవి నటిస్తోంది. ఈ మూవీలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న రిలీజ్ కానున్నది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్లలో సాయి పల్లవితోపాటు తన మూవీ టీమ్ తో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే.. విరాట పర్వం మూవీ ప్రమోషన్స్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడూతూ.. భారత ఆర్మీ విషయంలో వేసిన కామెంట్స్ కాంట్రవర్సియల్ గా మారాయి. 'భారత ఆర్మీ అలాగే పాకిస్తాన్ ఆర్మీ రెండు ఒకటే.. ఇండియన్ ఆర్మీకి పాకిస్థాన్ లో ఉన్న వాళ్లకు టెర్రరిస్టులుగా కనిపించవచ్చు. అలాగే వాళ్లకు మన వాళ్లు కూడా అలానే అనిపిస్తారు' అంటూ హింసపై కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. దీనికి తోడు కశ్మీర్ ఫైల్స్ మూవీలో కశ్మీరీ పండితుల ఊచకోతను ఆమె ఓ ముస్లిం డ్రైవర్ ను కొట్టి చంపడంతో పోల్చి చెబుతూ కామెంట్స్ కూడా దీనికి తోడయ్యాయి. దీంతో సాయి పల్లవిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఈ పాత వీడియో వైరల్ కావడంతో సాయి పల్లవి ఆమె ఇండియన్ ఆర్మీని అవమానించిందని, ఆమెను బాయ్‌కాట్ చేయాలని కొందరు పిలుపు నిస్తున్నారు. దీంతో బాయ్‌కాట్ సాయి పల్లవి #Boycottsaipallavi అనే హ్యాష్‌ట్యాగ్ ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇలా గతంలో చేసిన సాయిపల్లవి కామెంట్స్ తనతో పాటు అమరన్ మూవీ టీమ్ మెడకు చుట్టుకుంటున్నట్టు అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X