Sai Pallavi: ఆ రూట్లో డబ్బు సంపాదన వద్దని.. మరో 2 కోట్ల ఆఫర్ రిజెక్ట్!

సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన సాయిపల్లవి ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన క్యారెక్టర్ని చాలా కొత్తగా ఉండాలి అని అలాగే సినిమా కథ కూడా రిఫ్రెష్ గా అనిపించాలని ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేక్షకుల్లో ఒక బలమైన నమ్మకం ఏర్పరచుకున్న ఈ బ్యూటీ ప్రతి సినిమాతో ఒక మ్యాజిక్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రస్తుతం సినిమాల ద్వారా భారీగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్న సాయిపల్లవి ఒక రూట్లో మాత్రం డబ్బు సంపాదన అసలు వద్దని ఇటీవల ఒక రెండు కోట్లు ఆఫర్ ను కూడా రిజెక్ట్ చేసిందట. పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలుగు అమ్మాయిలా..

తెలుగు అమ్మాయిలా..

ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సాయి పల్లవిని చూసి మొదట అందరు కూడా తెలుగు అమ్మాయి అని అనుకున్నారు మలయాళంలో ప్రేమమ్ సినిమా ద్వారా మంచి క్రేజ్ అనుకున్న సాయిపల్లవి ఆ తర్వాత మొదటి సినిమాతోనే తెలుగు లో కూడా అంతకు మించి అనేలా క్రేజ్ అందుకుంది. ఇక ఈ బ్యూటీ కి తెలుగులో అయితే ఒక్కసారిగా పదుల సంఖ్యలో చాలా ఆఫర్స్ వచ్చాయి.

తొందరపడకుండా..

తొందరపడకుండా..

ఫిదా సినిమా సక్సెస్ తర్వాత సాయిపల్లవి క్రేజ్ పెరిగిపోవడంతో ప్రముఖ హీరోల నుంచి అలాగే అగ్ర నిర్మాత నుంచి దాదాపు పదికిపైగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మాత్రం తొందర పడకుండా కేవలం తనకు నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళ్ళింది. ఒకవేళ పారితోషికం తక్కువ ఇచ్చినా కూడా క్యారెక్టర్ స్టోరీ నచ్చితే మాత్రం వెంటనే ఒప్పేసుకుంది.

డబ్బుకు ఆశపడకుండా..

డబ్బుకు ఆశపడకుండా..

సాయి పల్లవి వీలైనంతవరకూ సినిమాల సెలక్షన్స్ విషయంలో డబ్బుకు ఏ మాత్రం ఆశపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించాలనే ఒక కమిట్మెంట్ తో ముందుకు సాగుతోంది. ఎంతో క్రమశిక్షణతో ఎలాంటి వివాదాల్లోకి వెళ్లకుండా సాయి పల్లవి నడుచుకుంటున్న విధానం ఈ రోజుల్లో చాలా మందికి ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది అనే చెప్పాలి.

భారీగా ఆఫర్స్

భారీగా ఆఫర్స్

అయితే ఇటీవల కాలంలో మాత్రం చాలా మంది అగ్ర తారలు అందరూ కూడా కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ భారీ స్థాయిలో ఆదాయం కూడా పెంచుకుంటున్నారు. కేవలం రెండు నిమిషాల యాడ్స్ కోసం ఒక రోజుల్లో రెండు మూడు గంటలు కెమెరా ముందు కనిలించినా చాలు కోట్లు అందుకోవచ్చు. ఇక అలాంటి యాడ్స్ లో స్టార్స్ అందరూ కూడా కోట్లు గడిస్తున్నారు. సాయిపల్లవికి కూడా అలాంటి ఆఫర్లు అయితే ఇప్పటి వరకు చాలానే వచ్చాయి.

ఆ యాడ్స్ చేసి ఉంటే..

ఆ యాడ్స్ చేసి ఉంటే..

అయితే సాయి పల్లవి మాత్రం సినిమాలో నటనకు ఒక ప్రత్యేకమైన గౌరవం ఇస్తోంది. ఆ హోదా ఇచ్చిన ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించాలి అనే ఆలోచనతో ముందుకు సాగుతూ ఉంటుంది. ఆమెకు ఎన్ని రకాల యాడ్స్ ఆఫర్స్ వచ్చినా కూడా అందులో నటించను అని చాలా ఓపెన్ గా చెప్పేసింది. ఇదివరకే ఆమెకు కొన్ని ఆఫర్లు రాగా వాటి రిజెక్ట్ చేసింది. ఒకవేళ ఆ యాడ్స్ కు ఒప్పుకుంటే సాయి పల్లవి ఇప్పటివరకు దాదాపు 15 కోట్లకు పైగానే సంపాదించుకునేదట.

ఆ రూట్లో సంపాధించనని..

ఆ రూట్లో సంపాధించనని..

యాడ్స్ లో నటించకుండా కేవలం ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో ఉండే ఒక తెలుగు ఛానల్ కోసం నటిస్తే పెద్దగా మైనస్ ఉండదు. కానీ అలాంటి యాడ్స్ లో కూడా ఆమె నటించడానికి ఇష్టపడట్లేదు. ఇటీవల ఒక ప్రముఖ ఎంటర్టైన్మెంట్ చానల్ వారు ఇతర సీరియల్స్ ను షోలను ప్రమోట్ చేసుకునే విధంగా సాయిపల్లవితో ప్రోమో తయారు చేయాలి అని అనుకున్నారు.

అందుకోసం ఆమెకు రెండు కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ రూట్లో మాత్రం అస్సలు డబ్బు సంపాదించనని కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తానని సాయి పల్లవి చాలా ఓపెన్ గా చెప్పినట్లుగా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X