Sai Pallavi: హీరోలను సాయి పల్లవి తొక్కేస్తుందా? హిట్స్‌ అన్నీ ఆమె ఖాతాలోకేనా?

దాదాపు అన్ని సినిమాలు చూసుకున్నట్టు అయితే దాదాపు అన్నీ మేల్ డామినేటెడ్ సినిమాలే ఎక్కువ కనిపిస్తాయి. హీరోల మార్కెట్ ఎక్కువ హీరోల కోసమే ఫ్యాన్స్ వస్తారు అనేది ఒకటి ఎప్పుడు నుంచో చాలా సినీ పరిశ్రమల్లో ఉంది. కాగా ఇలాంటి ట్రెండ్ ఒకటి కొనసాగుతున్న సమయంలో కొందరు హీరోయిన్స్ ఈ ట్రెండ్ ని చేశారు. అలా ఎప్పుడు నుంచో చాలా మంది హీరోయిన్స్ స్టార్ హీరోస్ కి ధీటుగా ఆ హీరోస్ నే సినిమాల్లో బీట్ చేసిన వారు ఉన్నారు.

అయితే ఇప్పుడు ఉన్న ట్రెండ్ లో కూడా ఈ రకమైన హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. ఎంతో మంది గ్లామర్ షో చేస్తూ స్టార్ స్టేటస్ తెచ్చుకొని ఉండొచ్చు కానీ కేవలం తన లుక్స్ పెర్ఫామెన్స్ తోనే ఓ హీరోయిన్ మాత్రం సౌత్ సినిమా దగ్గర తన సత్తా చూపిస్తుంది. కాగా ఆ హీరోయిన్ మరెవరో కూడా కాదు మలయాళ సినిమాకి మరియం, తెలుగు సినిమాకి భానుమతిగా బాగా ఫేమస్ అయ్యినటువంటి నటి సాయి పల్లవి.

sai pallavi only getting credit after young heroes movie hit now amaran also

మరి తన పెర్ఫామెన్స్ అండ్ డాన్స్ లతో భారీ క్రేజ్ ని సాయి పల్లవి తెచ్చుకుంది. ఇలా సాయి పల్లవి తెలుగులో కూడా భారీ క్రేజ్ ని సంపాదించుకుంది. అయితే తెలుగులో చేస్తున్న సినిమాల విషయానికి వస్తే ఆమె తన హీరోస్ ని డామినేట్ చేస్తుంది అనే టాక్ తన మొదటి సినిమా నుంచే ఉంది. కాగా మొదటి సినిమా "ఫిదా" తర్వాత "లవ్ స్టోరీ" ఆ తర్వాత ఆ మధ్య "విరాట పర్వం" సినిమా వరకు తెలుగులో సాయి పల్లవి పేరిటే నడిచింది.

ఒక టైం లో మేకర్స్ కూడా సాయి పల్లవి పేరుతోనే సినిమాలు కూడా ప్రమోట్ చేసుకున్నారు. ఐతే ఈ క్రమంలో ఆమె పక్కన ఒక నోటెడ్ హీరో కూడా ఉన్నప్పటికీ ఆమె పేరునే హైలైట్ చేయడం ఒకవేళ సినిమా హిట్ అయితే క్రెడిట్ కూడా ఆమెకే ఇవ్వడం కూడా స్టార్ట్ అయ్యింది. కాగా ఇపుడు మరోసారి ఇది వినిపిస్తుంది. సాయి పల్లవి తమిళ్ లో నటించిన లేటెస్ట్ సినిమానే "అమరన్".

ఇందులో ప్రముఖ హీరో శివ కార్తికేయన్ నటించాడు. శివ కార్తికేయన్ తమిళ్ సహా తెలుగులో కూడా బాగా తెలుసు తన మార్కెట్ కూడా చిన్నది కాదు. అలా తన నుంచి వచ్చిన ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చి ఊహించని విధంగా బుకింగ్స్ కూడా వస్తున్నాయి. ఇందులో కూడా సాయి పల్లవి తన మార్క్ సాలిడ్ పెర్ఫామెన్స్ ని చేసింది.

sai pallavi only getting credit after young heroes movie hit now amaran also

అయితే ఈ సినిమాకి కూడా మళ్ళీ ఎక్కువ క్రెడిట్ సాయి పల్లవికే చాలా మంది ఇచ్చేస్తున్నారు. సినిమా కంటెంట్ కూడా బాగుంది కానీ మేజర్ గా సాయి పల్లవి పైకే ఇప్పుడు అందరి ఫోకస్ వెళుతుంది. పైగా అమరన్ బుకింగ్స్ మహిమ అంతా కూడా సాయి పల్లవి క్రేజ్ వల్లే అంటూ చాలా మంది అంటున్నారు.

దీంతో మళ్ళీ ఆమెకే క్రెడిట్ ఇచ్చే పనిలో ఉన్నారు కానీ ఆమె నటించిన కొన్ని సినిమాలు టాక్ బాగున్నప్పటికీ ఘోరంగా విఫలం అయ్యినవి కూడా ఉన్నాయి కానీ అపుడు ఎవరూ నోరు మెదపలేదు. ఇపుడు మాత్రం క్రెడిట్ ఆమెది మాత్రమే అంటున్నారు. ఈ లెక్క ఏంటో చాలా మందికి అర్ధం కావడం లేదు. సాయి పల్లవి నుంచి "గార్గి" అనే ఒక ఎమోషనల్ సినిమా వచ్చింది. దీనిని అయ్యితే తెలుగు ఆడియెన్స్ అసలు పట్టించేకోలేదు. ఇపుడు వచ్చి ఆమె క్రేజ్ వల్లే అంటే పొంతన మిస్సవుతుంది.

More from Filmibeat

Read more about: sai pallavi amaran diwali 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X