డబ్బు కోసం ముద్దులు పెట్టను.. రొమాన్స్ కోసం వేరే వాళ్లను చూసుకోండి.. సాయి పల్లవి షాకింగ్‌గా
సినిమా పరిశ్రమలో రొమాంటిక్ సీన్లలో హీరోయిన్ల మితిమీరిన శృంగారం ప్రదర్శించడంపై అనేక రకాలుగా అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు.. తాజాగా రాబోయే టాక్సిక్ సినిమాలో హీరోయిన్లు హద్దు మీరి హీరోతో ముద్దులు కురిపించడం, అభ్యంతరకరమైన భంగిమలతో రొమాన్స్ చేయడం భారీ చర్చకు దారి తీశాయి. భారీ రెమ్యునరేషన్ కోసం తారలు ఎంతకైనా దిగజారుతున్నారా? అనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో సాయిపల్లవి పంచుకొన్న విషయాలు ఏమిటంటే?
హీరోయిన్ సాయి పల్లవి విషయానికి వస్తే.. తనకు నచ్చిన సినిమాలు, కథలు, పాత్రలకే మొగ్గు చూపుతారు. తనకు నచ్చని పాత్రల నటించడానికి ఎంత భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసిన ఆమె తలవొగ్గదు. రాశి కంటే వాసి ముఖ్యమని ఆమె భావిస్తుంటారు. అందుకే సినిమాలు తక్కువగా చేసినా.. తనకంటూ ఇమేజ్ క్రియేట్ చేసే పాత్రలు, తనపై ప్రేక్షకుల గౌరవం పెరిగే రోల్స్‌ను మాత్రమే ఎంచుకొంటారు అనే విషయం ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి.

సాయి పల్లవిని తమ చిత్రాల్లో నటింపజేయాలని బడా నిర్మాతలు, దర్శకులు, స్టార్ హీరోలు క్యూ కట్టినా.. తనకు నచ్చని సినిమాలు, పాత్రలు చేయనని తెగేసి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. రొమాన్స్‌కు దూరంగా, కిస్ సీన్లకు, శృంగార పరమైన సన్నివేశాలకు దూరంగా ఉంటూ బలమైన పాత్రల ద్వారానే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే తాజాగా ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాను ముద్దు సీన్లకు వ్యతిరేకం. నాకు బాయ్‌ఫ్రెండ్ ఉంటే.. నేను మరో వ్యక్తిని ఎలా ముద్దు పెట్టుకొంటాను. లేదా అలాంటి సీన్లలో నటించడానికి మనసు ఒప్పుకోదు. ఏ మహిళనైనా, మగాడైనా సంతోషకరమైన ఫ్యామిలీ లైఫ్‌ను లీడ్ చేయాలని అనుకొంటారు. జీవించడానికి విలాసవంతమైన కారు, ఇళ్లు ఉండాలని కోరుకొంటారు. ప్రస్తుతం అలాంటి విలాసవంతమైన జీవితం నాకు ఉంది. నేను చాలా సంతోషంగా లైఫ్‌ను గడుపుతున్నాను అని సాయిపల్లవి అన్నారు.
అయితే అదనంగా డబ్బు సంపాదించడానికి, మరో కారు కొనుక్కోవడానికి హీరోతో ముద్దు సీన్లలో నటించడం నాకు అవసరం లేదు. నటనకు, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న సినిమాలు ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. శృంగారం, హద్దు మీరిన సీన్లలో నటించడానికి మరొకరిని వెతుక్కోండి. నా వద్దకు మాత్రం రాకండి. అలాంటి సినిమాలు, సీన్లలో నటించడానికి నాకు అవసరం లేదు అని సాయిపల్లవి చెప్పారు.
సాయిపల్లవి కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల ఆమె తమిళంలో అమరన్, తెలుగులో థండేల్, హిందీలో ఏక్ దిన్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఓం చాప్టర్ 1: ఉదిరం: ది బ్లడ్ వుడ్, రామాయణ: ఫార్ట్ 1, పార్ట్ 2, మణిరత్నం రూపొందించే సినిమాల్లో నటిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications