పెళ్లి గురించి ఓపెన్ అయిన సాయి పల్లవి.. అందరికంటే భిన్నంగా, ఎప్పుడో చెప్పేసి షాకిచ్చిందిగా!

నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువ కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్ హోదా సంపాదించింది. చాలా పద్ధతైన పాత్రలు చేస్తూ వెళ్తున్న ఆమె తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే

Recommended Video

Shyam Singha Roy : Dancing Is So Easy If You Enjoy It - Sai Pallavi | Filmibeat Telugu
మలయాళ సినిమాల ద్వారా

మలయాళ సినిమాల ద్వారా

స్వతహాగా తమిళనాడు రాష్ట్రంలో పుట్టిన సాయి పల్లవి అనుకోకుండా మలయాళ సినిమాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో సూపర్ హిట్టయిన ప్రేమమ్ సినిమాలో మలర్ అనే ఒక పాత్రలో ఆమె నటించి ప్రేక్షకుల అందరినీ మెప్పించింది. నిజానికి అప్పుడు ఆమె మెడిసిన్ చదువుతోంది తన సెలవులలో నెల రోజుల పాటు షూటింగ్ కి వచ్చి ఆ సినిమా పూర్తి చేసింది.

అనేక అవార్డులు

అనేక అవార్డులు

మొదటి సినిమాకు మంచి ప్రశంసలు దక్కడంతో పాటు మలయాళ ఇండస్ట్రీ వ్యాప్తంగా అనేక అవార్డులు కూడా దక్కించుకుంది సాయి పల్లవి. ఈ నేపథ్యంలోనే ఆమె రెండో సినిమా కాళీ కోసం ఒక నెల రోజుల పాటు సెలవులు తీసుకుని మరీ ఆ షూటింగ్ పూర్తి చేసింది. చదువు పూర్తయిన తరువాత ఆమె తెలుగులో ఫిదా అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న సాయిపల్లవి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.

తెలుగులో వరుస అవకాశాలు

తెలుగులో వరుస అవకాశాలు

అలా ఆమె తెలుగులో వరుస అవకాశాలు దగ్గించుకుంటూ తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతానికి సాయి పల్లవి తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఆమె హీరోయిన్ గా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

సక్సెస్‌ జోష్‌లో

సక్సెస్‌ జోష్‌లో

గ్లామర్‌ పాత్రలకు నో చెబుతూ తన సహజమైన నటన, అదిరిపోయే డ్యాన్స్‌తో ఇటూ ప్రేక్షకులను, అటూ దర్శక-నిర్మాతలను ఫిదా చేస్తున్న సాయి పల్లవి ఏ విషయంపై అయినా ముక్కుసూటిగా స్పందింస్తుందనే పేరుంది. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అడిగిన ప్రశ్నకు కూడా అదే తీరులో సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి తన తాజా చిత్రం శ్యామ్‌ సింగరాయ్‌ సక్సెస్‌ జోష్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మూవీ సక్సెస్‌ మీట్స్‌, మీడియా ఇంటర్య్వూలతో శ్యామ్‌ సింగరాయ్‌ టీం బిజీగా ఉంది.

ఇప్పుడే పెళ్లి ఏంటండీ బాబు

ఇప్పుడే పెళ్లి ఏంటండీ బాబు

ఈ క్రమంలో ఇటీవల ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సాయి పల్లవికి మీ పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఎదురైంది. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు కనుక ఎవరైనా అడిగితే వారు సిగ్గుపడుతూ, మాకు కెరీర్ ముఖ్యం సినిమా తర్వాత ఏదైనా అంటూ ఆసక్తికర సమాధానాలు చెబుతారు కానీ సాయి పల్లవి మాత్రం ఎలాంటి బెరుకు లేకుండా 'నాకు ఇప్పుడే పెళ్లి ఏంటండీ బాబు.. నాకు ఇంకా 29 ఏళ్లు మాత్రమే.

30 ఏళ్లు వచ్చాక అప్పుడు పెళ్లి గురించి ఆలోస్తా' అంటూ తనదైన శైలిలో ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ఇక తెలుగులో సాయి పల్లవి నటించిన మరో చిత్రం విరాటపర్వం విడుదల కావాల్సి ఉండగా తమిళంలో కూడా ఆమె మూవీ చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X