జయలలిత స్నేహితురాలిగా సాయి పల్లవి!
తమిళనాట దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ కు భారీ డిమాండ్ నెలకొని ఉంది. పలువురు దర్శక నిర్మాతలు జయలలిత బయోపిక్ ని తెరకెక్కించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ది ఐరన్ లేడి పేరుతో మహిళా దర్శకురాలు ప్రియదర్శిని జయలలిత బయోపిక్ రూపొందిస్తోంది. ఈ చిత్రంలో నిత్యామీనన్ జలయలిత పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ జయలలిత జీవితంపై మరో చిత్రానికి సన్నాహకాలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో జయ పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్రం విషయంలో క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి పేరు కూడా వినిపిస్తోంది. సాయి పల్లవిని జయలలిత స్నేహితురాలు శశికళ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. సాయి పల్లవి ఒకే చెప్పిందా లేదా అనేది చిత్ర యూనిట్ ఇంకా ప్రకటించలేదు.

జలలితకు నెచ్చెలిగా ఉంటూ ఆమె బాగోగులు అన్ని చూసుకునేది శశికళ మాత్రమే. జయ మరణం తరువాత శశికళ అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి పాత్ర కోసం సాయి పల్లవి పేరు వినిపించడం విశేషం. సాయి పల్లవి నటించిన తెలుగు చిత్రం పడిపడి లేచే మనసు, తమిళ చిత్రం మారి 2 థియేటర్స్ లో సందడి చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











