30 రోజులు నిద్ర లేకుండా అలా చేస్తే.. భరించలేక ఏడ్చేశా..: సాయిపల్లవి
Sai Pallavi: మహానటి సావిత్రి,నటి సౌందర్య ల తర్వాత సినిమా ఇండస్ట్రీలో అంతటి గౌరవాన్ని దక్కించుకున్ననటి సాయి పల్లవి. కేవలం తెలుగు ప్రేక్షకుల మదిలోనే పాన్ ఇండియా లెవల్ లో పాపులారిటీ సంపాదించుకున్నారు. తన అందం, అభినయంతో కోట్లాది మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. అలాగే వరుస విజయాలు అందుకుంటూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయారు. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఓ సినిమా షూటింగ్ సమయంలో చాలా ఏడ్చేసిందట. అసలేం జరిగిందంటే?
న్యాచులర్ బ్యూటీ సాయి పల్లవి మలయాళంలో ప్రేమమ్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తన అద్భుత నటనతో తొలి సినిమాలోనే మెస్మరైజ్ చేసింది సాయిపల్లవి. ఆ సినిమా ఫేమ్ తో దుల్కర్ సల్మాన్ తో 'కాళి' సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ చిత్రం తెలుగులో 'హే పిల్లగాడా' పేరుతో డబ్ చేసిన విషయం తెలిసిందే. ఇక డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సాయిపల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తెలంగాణ పిల్లగా నటించి.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ విక్టరీతో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది.

ఆ తర్వాత నేచురల్ సార్ట్ నానితో శ్యామ్‌సింగరాయ్, అక్కినేని నాగ చైతన్యతో లవ్‌స్టోరీ(Love Story)సినిమాల్లో నటించి.. బ్లాక్ బస్టర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది సాయి పల్లవి. తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటించే అవకాశం కొట్టిసిందే. తన కెరీర్ లో వరుస హిట్ అందుకుంటూ.. స్టార్ హీరోయిన్ గా మారింది. సాయి పల్లవి నటించిన అన్ని భాషల్లో కూడా సూపర్ సక్సెస్ లు కొట్టింది. ఇటీవల సాయిపల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన అమరన్ మూవీలో నటించింది. ఈ మూవీలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై.. హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ మూవీని తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.
ఇదిలాఉంటే.. హీరోయిన్ సాయిపల్లవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. 'శ్యామ్ సింగరాయ్' షూటింగ్ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాననీ, ఆ విషయం తన చెల్లికి చెప్పుకుంటూ ఏడ్చేశానని చెప్పుకొచ్చింది. అసలేం జరిగిందంటే ? ఆ ఇంటర్య్వూలో సాయి పల్లవి మాట్లాడుతూ.." శ్యామ్ సింగరాయ్ షూటింగ్ సమయంలో ఆ సినిమాలో చాలా సన్నీవేశాలు రాత్రి వేళనే షూట్ చేశారు. అయితే నాకు రాత్రి షూటింగ్‌లు అస్సలు అలవాటు లేదు. అంతే కాకుండా.. రాత్రులు షూటింగ్ లో పాల్గొని .. పగలు పడుకుందామంటే..నిద్ర రాదు. దీంతో రాత్రి షూటింగ్ చాలా ఇబ్బందిగా.. చాలా కష్టంగా అనిపించేది. అలా తెల్లవారు వరకూ మేల్కొని ఉండాల్సివచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 30 రోజులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న..'అంటు తన భాదను వెల్లడించింది.

సాయి పల్లవి ఇంకా మాట్లాడుతూ.. 'శ్యామ్ సింగరాయ్ తో పాటు ఒప్పుకున్న సినిమాల షూటింగ్స్ లో పాల్గొనాలి. దీంతో నా షెడ్యూల్ చాలా టైట్ గా మారింది. ఇలాంటి సమయంలో నా చెల్లెలు నన్ను చూడటానికి వచ్చింది. అప్పుడు నా పరిస్థితి చెప్పుకుంటూ పుల్ గా ఏడ్చేశా.. ఒప్పుకొన్న సినిమాలన్ని ఖచ్చితంగా చేయాలి. కానీ రెస్ట్ దొరకడం లేదు." అంటూ తన భాదను తన చెల్లిని చెప్పుకున్నానని తెలిపారు. ఈ విషయాన్ని తన చెల్లెనే నేరుగా 'శ్యామ్ సింగరాయ్' ప్రొడ్యూసర్ దగ్గరకు వెళ్లి 'మా అక్క ఏడుస్తోంది. ఒక రోజైనా లీవ్ ఇవ్వండి'అని అడిగిందంట. దీంతో నిర్మాత వెంకట్ వెంటనే ..పదిరోజులు లీవ్ ఇచ్చారంట. ఈ మూవీ సాయి పల్లవి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. మెయిన్ గా సాయిపల్లవి డ్యాన్స్ సినిమాకే హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











