రెమ్యునరేషన్ ఎంత ఇచ్చినా అలాంటివి చేయను.. F2 దర్శకుడికి షాక్ ఇచ్చిన సాయి పల్లవి

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా వైరల్ అవుతుంటాయి. ఇక సీక్రెట్ గా ఎవరితోనైనా కనిపిస్తే.. ఆమె ఎవరితో ఉంది అని తెలియకుండా గాసిప్స్ క్రియేట్ చేస్తుంటారు. అయితే అలాంటి రూమర్స్ కి తావివ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న వారిలో సాయి పల్లవి ఒకరు. ఈ బ్యూటీ ఎలాంటి సినిమాలు చేసినా కూడా అందులో ఎదో ఒక హైలెట్ పాయింట్ ఉంటుంది. వీలైనంత వరకు నటనకు ప్రాధాన్యం ఉండేలా చూసుకుంటుంది.

ఆ దర్శకుడు ఛాన్స్ ఇస్తే..

ఆ దర్శకుడు ఛాన్స్ ఇస్తే..

హీరోయిన్స్ చాలా వరకు సక్సెస్ లో ఉన్న దర్శకుడితో క్లోజ్ గా ఉండడానికి ట్రై చేస్తుంటారు. ప్రస్తుత రోజుల్లో 100% సక్సెస్ రేట్ ఉన్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా అందులో ఒకరు. వరుసగా బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న అనిల్ తో సినిమా చేయడానికి ఎలాంటి హీరోయిన్ అయినా కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటుంది.

రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

పైగా అనిల్ కమర్షియల్ గా హీరోయిన్స్ లలో ఎమోషనల్ అనే కాకుండా ఒక కామెడీ యాంగిల్ ని కూడా చూపిస్తూ ఉంటారు. F2 లాంటి సక్సెస్ అనంతరం అనిల్ రేంజ్ ఇంకాస్త పెరిగింది. అయితే ఇటీవల సాయి పల్లవికి ఆఫర్ ఇవ్వగా కళ్ళు మూసుకొని ఒప్పుకుంటుందని అనుకున్నారట. కానీ ఆమె ఎవరు ఊహించని విధంగా అతని ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కథ నచ్చలేదా..?

కథ నచ్చలేదా..?

అసలు మ్యాటర్ లోకి వస్తే నెక్స్ట్ అనిల్ రావిపూడి F2 కాన్సెప్ట్ తరహాలో F3ని తెరకెక్కించాలని చూస్తున్నాడు. 2021 జనవరి అనంతరం షూటింగ్ ప్లాన్ కూడా రెడీ చేసుకుంటున్నారు. మునుపటి హీరో హీరోయిన్స్ ఎలాగూ ఫిక్స్ అయ్యారు. అయితే సినిమాలో మరో జోడిని ఫిక్స్ చేయాలని అనుకుంటున్న దర్శకుడు ముందుగా హీరోయిన్ సాయి పల్లవిని సెలెక్ట్ చేసుకోవాలని అనుకున్నాడట. కానీ ఆమె కాన్సెప్ట్ గురించి రెండు మూడు లైన్స్ వినగానే రిజెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది.

దిల్ రాజుకు కూడా ఓపెన్ గానే చెప్పేసిందట

దిల్ రాజుకు కూడా ఓపెన్ గానే చెప్పేసిందట

ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా అలాంటి పాత్రలు చేయాలని అనుకోవడం లేదని నిర్మాత దిల్ రాజుకి ఓపెన్ గానే చెప్పేసిందట సాయి పల్లవి. దీంతో చిత్ర యూనిట్ మరొక హీరోయిన్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం. దిల్ రాజు ప్రొడక్షన్ లో గతంలో సాయి పల్లవి ఫిదా, MCA సినిమాలు చేసిన విషయం తెలిసిందే. నిర్మాత, దర్శకులు ఎవరైనా కూడా సాయి పల్లవి పాత్రల ఎంపిక విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదని అర్ధమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X