కోట్ల రూపాయలు పోగొట్టుకున్న సాయి పల్లవి.. డబ్బంటే అసలు లెక్కేలేదు..

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ సంఖ్య చాలానే ఉంది. అయితే అందులో ఎవరైనసారే ఒక్క ఫ్లాప్ ఎదుర్కొంటే మళ్ళీ మరో హిట్టు పడితే గాని ఫామ్ లోకి రారు. కానీ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబందం లేకుండా ఛాన్సులు అందుకునే హీరోయిన్స్ చాలా తక్కువమంది ఉంటారు. అందులో సాయి పల్లవి ఒకరు. ఇక సాయి పల్లవి తన నిర్ణయాలతో కోట్ల రూపయల ఆదాయాన్ని వదులుకుందట.

Recommended Video

Saranga Dariya 100 Million Views Record, ఆ ఇద్దరూ ప్రధాన కారణం!!
 కంటెంట్ ఉంటేనే..

కంటెంట్ ఉంటేనే..

సాయి పల్లవి ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది అంటే అందులో మినిమమ్ కంటెంట్ ఉంటుందని చెప్పవచ్చు. ఆమెను చూసి సినిమాపై ఇంట్రెస్ట్ చూపించే జనాలు చాలామంది ఉంటారు. కెరీర్ మొదట్లోనే ఆమె టాలెంట్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది.

తేడా చూపించకుండా

తేడా చూపించకుండా

ఫిదా సినిమాతో ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా అనంతరం ఆమెతో ఎలాగైనా సినిమా చేయాలని స్టార్ దర్శకులు కూడా ఓపెన్ గానే స్టేజ్ లపై చెప్పేశారు. అయితే సాయి పల్లవి మాత్రం తన వద్దకు వచ్చేవారు స్టార్ దర్శకులా చిన్న దర్శకులా అని తేడా చూపించదు. కథ నచ్చితేనే ఆమె ఎవరికైనా సరే యాక్ట్ చేయడానికి ఓకే చెబుతుంది.

 సడన్ గా రెమ్యునరేషన్ పెంచినట్లు..

సడన్ గా రెమ్యునరేషన్ పెంచినట్లు..

మలయాళం అమ్మాయి అయినప్పటికీ రెండు మూడు సినిమాలతో ఆమె తెలుగమ్మాయి అనేంతలా గుర్తింపు అందుకుంది. ఇక సాయి పల్లవికి పాత్ర నచ్చితే రెమ్యునరేషన్ విషయంలో కూడా పెద్దగా అభ్యంతరాలు చెప్పాదు. ఆ మధ్య డేట్స్ ఎక్కువ రోజులు తీసుకోవడం వలన నేను లోకల్ సినిమాకు సడన్ గా రెమ్యునరేషన్ పెంచినట్లు టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని దిల్ రాజు చెప్పేశారు.

 రెమ్యునరేషన్ ఎంతంటే..

రెమ్యునరేషన్ ఎంతంటే..


నిజానికి ఒక విధంగా సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏనాడు రెమ్యునరేషన్ కోసం ఆశపడి సినిమాలు చేసింది లేదు. కేవలం పాత్ర నచ్చితేనే సినిమాలు చేయడానికి ఒప్పుకుంది. ప్రస్తుతం మార్కెట్ పరంగా సాయి పల్లవి ఒక్కో సినిమాకు 80లక్షల నుంచి కోటి వరకు పారితోషికం అందుకుంటోంది.

డబ్బును లెక్క చేయకుండా..

డబ్బును లెక్క చేయకుండా..


ఇక ఆ మధ్య కొన్ని ఆఫర్స్ వదులుకోవడం వలన అమ్మడు దాదాపు 5 నుంచి 6కోట్ల మధ్య ఆదాయాన్ని పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. సరిలేరు నీకెవ్వరు, డియట్ కామ్రేడ్ వంటి సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ ఛాన్సులను కూడా రిజెక్ట్ చేసింది. హీరోయిన్ పాత్రకు పెద్దగా స్కోప్ లేని మరో రెండు కమర్షియల్ ఆఫర్స్ ను కూడా రిజెక్ట్ చేసిందట. అదే విధంగా యాడ్స్ ను కూడా చేయనని చెప్పేసింది. దీంతో ఆ విధంగా సాయి పల్లవి ఆదాయం తగ్గినట్లు టాక్. ఒక విదంగా సాయి పల్లవి డబ్బును లెక్క చేయకుండా సినిమాలు చేస్తుందని చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X