దాదాపు 10కోట్ల ఆదాయాన్ని వదులుకున్న సాయి పల్లవి.. డబ్బు కోసం ఆ పనులు చేయదట
సాయి పల్లవి అంటే కేవలం ఒక హీరోయిన్ అనే కాదు. మంచి ఆలోచనలు ఉన్న బాధ్యత గల యువతి. ఎందుకంటే.. స్వేచ్చా ప్రపంచంలో తల్లిదండ్రులకు మచ్చ తెచ్చే పని ఆమె ఎప్పుడు చేయదట. వీలైనంత వరకు ఒక సింపుల్ అమ్మాయిలా ఉంటేనే తనకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందని చెబుతోంది. డబ్బుకంటే కూడా ఆమె విలువలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె జీవితంలో కొన్ని బలమైన రూల్స్ ని ఏర్పాటు చేసుకుంది. వాటిపై ఒక లుక్కేస్తే..

గ్లామర్ తోనే కాకుండా..
సాయి పల్లవి సోషల్ మీడియాలో ఎక్కువగా హైలెట్ అయ్యే విధంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. కానీ సామాజిక అంశాలపై ఆమె అవసరమైనప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ఈ రోజుల్లో గ్లామర్ తోనే అవకాశాలు అందుకుంటారు అనే మాటకు ఆమె తన సినిమాలతో కౌంటర్ ఇస్తూనే ఉంది.

రెమ్యునరేషన్ తక్కువైనా..
డాక్టర్ అవ్వాల్సిన అమ్మాయి ఎంతో ఇష్టంగా యాక్టింగ్ పై ఎందుకు అడుగులు వేసింది అనే ప్రశ్నలకు తన నటనతోనే సమాధానం చెప్పింది. ఇక ఇక సాయి పల్లవి రెమ్యునరేషన్ కెరీర్ మొదటి నుంచి పెరుగుతూనే ఉంది. ఆమె సాలరీ ఒక సినిమాకు కోటి వరకు వచ్చింది అనే టాక్ కూడా వచ్చింది. అలాగే మంచి పాత్రలు వస్తే.. రెమ్యునరేషన్ తక్కువైనా పర్లేదని ఒప్పుకుంటుందట.

లిప్ లాక్ సీన్స్..
కొన్ని సందర్భాల్లో లిప్ లాక్ ఉన్న సినిమా కథలు చాలా సార్లు వచ్చయట. అలాగే గ్లామర్ ప్రజెంటేషన్ ఎక్కువగా ఉన్న పాత్రలు కూడా వచ్చయట. ఆ సినిమాలు చేస్తే సాయి పల్లవి ఆదాయం ఈజీగా నాలుగు నుంచి ఐదు కోట్ల వరకు పెరిగి ఉండేది. కానీ ఆమె అలాంటి పాత్రలకు ఒప్పుకోలేదు. కథ డిమాండ్ చేసినా కూడా గ్లామర్ డోస్ కి నో చెప్పలేదు.

యాడ్స్ చేయకపోవడానికి కారణం..
అందుకు కారణం.. సినిమాల విషయంలో ఆమె సొంతంగా కొన్ని నియమాలను ఏర్పాటు చేసుకుంది. అలాంటి పాత్రలు చేయడానికి తనకు ఏ మాత్రం ఇష్టం ఉండదని చెప్పింది. ఇక యాడ్స్ లో నటించినా కూడా ఈ బ్యూటీకి ఎంతో డబ్బు వచ్చి ఉండేది. కానీ అలాంటి ఆఫర్స్ ని కూడా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ప్రకటనలతో తనల్ని అభిమానించే వారిని మోసం చేసి డబ్బు సంపాదించాలని అనుకోవడం లేదని ఆమె వివరణ ఇచ్చింది.

అలా చేసి ఉంటే..
ఒక విధంగా సాయి పల్లవి తన జీవితంలో ఏర్పాటు చేసుకున్న కొన్ని స్వయం నిబంధనలు ఆమెకు మంచి గుర్తింపునే తెచ్చాయి. ఆమె గనక ఇప్పటివరకు వచ్చిన సినిమాల్ని అలాగే యాడ్స్ ని చేసి ఉంటే గనక ఆమెకు ఈజీగా 10కోట్లకు పైగా ఆదాయం పెరిగి ఉండేది. కానీ ఆమె అలా చేయలేదు. నిజానికి ఈ రోజుల్లో ఇలాంటి హీరోయిన్స్ ఉండడం గ్రేట్ అంటున్నారు ఆమె ఫాలోవర్స్..


Click it and Unblock the Notifications











