తల్లిదండ్రుల నుంచి సాయి పల్లవికి ఒత్తిడి.!

లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి 'తండేల్'తో తన కెరీర్లో మరోసారి గ్రాండ్ సక్సెస్ ను అందుకుంది. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను రాబడుతుందో మనకు తెలిసిందే. ఇక సాయిపల్లవి నుంచి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాల్లో ఎంత నేచురల్ గా ఉంటారో బయట కూడా అంతే నార్మల్ గా కచ్చితంగా ఉంటారు. ఇక సాయి పల్లవికి స్టార్ హీరోలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ఆ స్థాయిలో క్రేజ్ ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే ఆమెకు లేడీ పవర్ స్టార్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.

రోటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్న సాయి పల్లవి తాజాగా 'తండేల్'లో ప్యూర్ లవ్ స్టోరీని ఆడియెన్స్ కు చూపించిన విషయం తెలిసిందే. గతంలో 'విరాటపర్వం'తో రెబలిస్ట్ గానూ మెరిసి ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం రెండోసారి అక్కినేని నాగచైతన్యతో కలిసి బిగ్ స్క్రీన్ పై మేజిక్ చేసింది. బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఓవైపు సినిమా మంచి సక్సెస్ ను అందుకుంటుండటంతో మరోవైపు సాయి పల్లవి తాజాగా తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పిన ఓ మేటర్ నెట్టింట వైరల్ గా మారింది.

Sai Pallavi Revealed Her Secret she want to wear that Special Saree

అయితే.. సాయిపల్లవికి 21 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వాళ్ల నానమ్మ ఓ చీరను బహూకరించిందంట. అది సాయిపల్లవి పెళ్లికి కట్టుకోవాలని చెప్పిందంట. అప్పటి సాయిపల్లవి ఇంకా సినిమాల్లోకి రాలేదని.. కానీ వెండితెరకు పరిచయం అయ్యాక ఈ చీరకట్టుకునే అవకాశం ఇప్పటికీ రాలేదన్నారు. కానీ సినిమా అవార్డుల్లో అత్యుత్తమమైన నేషనల్ అవార్డ్ అందుకుంటే మాత్రం ఆ చీరకట్టుకొని వెళ్తానని చెప్పింది. కానీ ఇంకా సమయం పట్టేలా ఉందన్నారు. ఏదోలా ఆ శారీ కట్టుకునే వరకు తల్లిదండ్రుల నుంచి సాయిపల్లవికి ఒత్తిడి తప్పదన్నారు.

ఇక ఇప్పటికే సాయిపల్లవి పెళ్లి ఎప్పుడంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తికరంగా చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇలాంటి న్యూస్ వైరల్ అవుతుండటం ఆసక్తికరంగా మారింది. తన చెల్లి పూజా కన్నన్ కు గతేడాది తానే దగ్గరుండి మరీ పెళ్లి చేసిన విషయం తెలిసిందే. చెల్లి పెళ్లి వేడుక, ఈవెంట్లలో జోరుగా డ్యాన్స్ కూడా చేసి ఆకట్టుకుంది. ఇక సాయిపల్లవి ప్రస్తుతం కెరీర్ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లను అందుకుంటోంది. మరోవైపు త్వరలో బాలీవుడ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే ఎక్ దిన్, రామయణ : పార్ట్ 1 చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Sai Pallavi Revealed Her Secret she want to wear that Special Saree

'తండేల్'లో అక్కినేని నాగచైతన్య శ్రీకాకుళం ఫిషర్ మెన్ పాత్రలో జీవించారు. సత్య పాత్రలో సాయిపల్లవి అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చింది. ప్యూర్ లవ్, యాక్షన్, దేశభక్తి కలిగిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పించగా.. బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ను ఫిదా అయ్యేలా చేసింది. తొమ్మిది రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసింది. ఇంతంటి సక్సెస్ రావడం అక్కినేని నాగచైతన్య కెరీర్ లోనే మొదటిసారి కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఇప్పటికీ అంతటా మోగుతూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X