'రౌడీ బేబీ'కి కోటి మంది ఫిదా.. దూసుకుపోతున్న సాయిపల్లవి సాంగ్!

క్రేజీ బ్యూటీ సాయిపల్లవి, ధనుష్ జంటగా నటించిన మారి 2 చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. సాయిపల్లవి ప్రేమమ్ చిత్రంతో ఒక్కసారిగా సౌత్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ప్రేమమ్ తెచ్చిన క్రేజ్ తో తెలుగులో ఫిదా చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. ఈ చిత్రంలో సాయి పల్లవి చలాకి నటనకు తెలుగు యువత నిజంగానే ఫిదా అయ్యారు.

సాయిపల్లవి మంచి నటి మాత్రమే కాదు. అద్భుతమైన డాన్సర్ కూడా. మారి 2 చిత్రంలో మరోమారు తన డాన్సింగ్ స్కిల్స్ ని బయట పెట్టింది. రౌడీ బేబీ అంటూ సాగే వీడియో సాంగ్ ని ఇటీవల యూట్యూబ్ లో విడుదుల చేశారు. ఈ పాటలో సాయిపల్లవి వేసిన స్టెప్పులు యువతని బాగా అలరిస్తున్నాయి. దీనితో కేవలం రెండు రోజుల్లోనే ఈ వీడియో సాంగ్ కు కోటికి పైగా వ్యూస్ లభించాయి.

యూట్యూబ్ ట్రెండింగ్ లో ఈ పాట రెండవ స్థానంలో ఉంది. బాలాజీ మోహన్ ఈ చిత్రానికి దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. మారి 2తో పాటు సాయిపల్లవి నటించిన తెలుగు చిత్రం పడిపడి లేచే మనసు చిత్రం కూడా విడుదలైంది. కానీ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

Sai Pallavis Rowdy Baby song making sensation in youtube.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X